పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు?

Purushottham Vinay
దేశంలో నిత్యావసరాలు మొదలుకొని అన్ని రకాల వస్తుసేవల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్‌, డీజెల్‌ ధరల పెరుగు దలతో అన్ని రకాల వస్తువులు, సేవలు, నిత్యావసరాలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరి, ఎనిమిదేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. మన ప్రభుత్వాల వైఫల్యాలు, అనియంత్రిత ధోరణులతో పేదలు, సామాన్యుల జీవన వ్యయ ప్రమాణాల్లో ఘోరమైన మార్పులు సంతరించుకుంటున్నాయి.వంటనూనెలు, కూర గాయలు, పప్పు దినుసులు, డైరీ, పాలు, పౌల్ట్రి, చికెన్‌, మటన్‌, పండ్లు, సర్వీసులు, ఇంటి అద్దెలు మొదలుకొని గృహవినియోగ సేవలు, కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్ల వంటి అన్ని రకాల ధరలు ఇప్పుడు పేదలకే కాకుంగా, మధ్యతరగతి, ఆపై తరగతి వర్గాలకు కూడా భారంగా మారాయి. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 నుంచి రూ.110కి పెరగ్గా, డీజెల్‌ లీటర్‌ రూ.90 నుంచి రూ.100కు పెరిగింది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడా యిల్‌ ధర 100 డాలర్లు దాటనుందనే అంచనాల నేపథ్యంలో ఈ ధరలు ఇప్పుడప్పుడే ఆగే పరిస్థితి లేదు.


ఈ పెరుగుదల ప్రభావం 60శాతం మంది జనాభాపై పడుతున్నది. పౌరుల ఆదాయాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. 80శాతం మంది జనాభాపై పొదుపు ప్రభావం నమోదవుతున్నది. ఇప్పటికే ఇతర ఖర్చులను తగ్గించుకుంటున్న ప్రజలు తప్పనిసరి ఖర్చులనే భరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే విద్య, వైద్యంతోపాటు రవాణా ఖర్చుల్లో పెరుగుదల బడ్జెట్‌ను దెబ్బతీస్తున్నాయి.ఇంటి అద్దెల పెరుగుదల సొంత ఇండ్లు లేని వారికి శాపంగా పరిణమించింది. ఈ రంగంలో 165శాతం పెరుగుదల వృద్ధి చెందింది. హౌసింగ్‌ రంగంలో 71శాతం, మందులు 54శాతం, బస్సులు, లోకల్‌ రైళ్లు చార్జీలు 53శాతం, ట్యూషన్‌ ఫీజులు 50శాతం విద్యుత్‌పై 20శాతం పెరుగుదల పేదలను ఇబ్బంది పెడుతున్నాయి.పెరుగుతున్న పెట్రోల్‌, డీజెల్‌ ధరలు సామాన్యుల బడ్జెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. వారి పొదుపు మొత్తాలను హరించేస్తున్నాయి. ప్రజలకు నిత్యం వినియోగించే కూరగాయల ధరలు కూడా ఆకాశంలోకి చేరాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: