అయ్య బాబోయ్.. చెట్టుకు బొక్క పడింది?
ఇలా సోషల్ వీడియోలు వెలుగులోకి వచ్చి కొన్ని ఘటనల ద్వారా అందరూ షాక్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ఒక ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. కొన్ని కొన్ని సార్లు అడవుల్లో చిత్రవిచిత్రమైన చెట్లు బయట పడటం నుంచి జరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటివి జరిగితే ఇదే హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే పెంచికలపేట రేంజ్ లో విభిన్న జంతు జాతులకు వృక్ష జాతులకు నెలవు అనే విషయం తెలిసిందే. ఇక్కడ ఉన్న ఒక వృక్షం గురించి వార్త వైరల్ గా మారిపోయింది.
పెంచికల్ పేట బీట్ పరిధిలో ఉన్న నల్లమద్ది వృక్షం లోపల ఒక పెద్ద తొర్ర ఏర్పడింది. ఇటీవలే అడవిలో గస్తి నిర్వహిస్తున్న సమయంలో అధికారులు ఇక చెట్టుకు ఏర్పడిన ఈ పెద్ద హోల్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు అని చెప్పాలి. బీట్ అధికారి దినేష్ గస్తి నిర్వహిస్తున్న సమయంలో అడవులలో తిరుగుతుండగా పెద్ద హోల్ గుర్తించాడు. సిబ్బంది చెట్టు మొదలు నుంచి లోపలికి వెళ్లి చూడగా మనిషి పట్టేంత పెద్దగా హోల్ వుంది అన్న విషయాన్ని గుర్తించారు. ఈ విషయం తెలిసిన వారు చెట్టును చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారని చెప్పాలి.