డెబిట్,క్రెడిట్ కార్డుదారులకు అలర్ట్ న్యూస్.. సైబర్ నేరగాల్ల నుంచి రక్షించుకునేందుకు ఆర్బీఐ ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ ను తీసుకువస్తున్న సంగతి తెలిసిందే.. ప్రతి నెల కొత్త రూల్స్ ను మారుస్తున్న విషయం తెలిసిందే..
బ్యాంక్ ఖాతాదారులను సైబర్ మోసాల నుంచి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వస్తుంది.కొన్ని నెలల క్రితం టోకనైజేషన్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే... దీని వల్ల వారి కార్డుల వివరాలు సేఫ్ గా ఉంటాయి.. ఇలా చేయడం వల్ల మన అకౌంట్ వివరాల సేఫ్ గా ఉంటాయి.
ఆర్బీఐ నూతనంగా కార్డ్-ఆన్-ఫైల్ టోకనైజేషన్ నిబందనల ను
అక్టోబర్ 1 నుంచి అమలు చేయనుంది. గతంలో కార్డుల వినియోగదారులు వారి భవిష్యత్ చెల్లింపుల కోసం వ్యక్తిగత సమాచారం.. అంటే బ్యాంక్ నెంబర్లు, వారి పేర్లు, ఇతర వివరాల్ని వెబ్‌సైట్‌లో స్టోర్ చేసేవాళ్లు. దీని కారణంగా సైబర్ నేరాల కు పాల్పడే వారి పని ఈజీగా మారింది. వీటిని అరికట్టేందుకు నూతన టోకన్ పద్దతిని ప్రవేశపెట్టింది ఆర్బీఐ..
ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసేటప్పుడు 16 అంకెల కార్డు నంబర్, పేర్లు, గడుపు తేది వంటి సమాచారం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆయా బ్యాంకులు జారీ చేసే నంబర్‌తో ఇక పై లావాదేవీలు చేసుకోవచ్చు. కస్టమర్ల కార్డ్ వివరాలను సేఫ్‌గా ఉంచేందుకు ఆర్బీఐ ఈ టోకనైజేషన్ నిబంధనలను అమలు చేస్తోంది. దీని అమలు తర్వాత కస్టమర్ల డేటా మొత్తం వారి బ్యాంకు వద్ద మాత్రమే ఉంటుంది తప్ప ఇతర వెబ్‌సైట్‌లలో ఉండదు. ఈ సర్వీసును పొందేందుకు ఎటువంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు.. మరో వైపు ఆర్బీఐ రేపొ రేటును కూడా పెంచింది. దాంతో బ్యాంకులు ఎఫ్డి పై వడ్డీ రేట్లను కూడా పెంచింది.. వచ్చే నెల 1 వ తారీఖు నుంచి మరికొన్ని రూల్స్ మారనున్నాయి..