రాయలసీమ : ఇక్కడ వైపీపీ గెలిచేది అనుమానమేనా ?

Vijaya






హిందుపురం వైసీపీ మాజీ ఇన్చార్జి రామకృష్ణారెడ్డి హత్య అధికారపార్టీని కుదిపేస్తోంది. పార్టీలోని ప్రత్యర్ధి వర్గమే రామకృష్ణారెడ్డిని హత్యచేయించిందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మృతుడి కుటుంబసభ్యులే ఈ ఆరోపణలు చేస్తుండటంతో ప్రభుత్వానికి ఏమిచేయాలో దిక్కుతోచటంలేదు. అందుకనే నిజానిజాలు తెలుసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకునే బాధ్యతలను జగన్మోహన్ రెడ్డి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు.





ఇక్కడ గమనించాల్సిందేమంటే జగన్మోహన్ రెడ్డి చర్యలు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది. రామకృష్ణారెడ్డికి ప్రత్యర్ధివర్గానికి ఎప్పటినుండో గొడవలున్నాయన్న విషయం పార్టీలో అందరికీ తెలుసు. గొడవలను సర్దుబాటు చేయమని ఎప్పటినుండో స్ధానికనేతలు మొత్తుకుంటున్నారు. అయినా కానీ పార్టీ పెద్దలు సీరియస్ గా తీసుకోలేదు. ఇపుడు కుటుంబసభ్యులేమో ఎంఎల్సీ మహ్మద్ ఇక్బాల్, ఆయన పీఏ గోపీకృష్ణే చేయించారంటు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. మృతుడి కుటుంబసభ్యుల ఆరోపణలు ప్రతిపక్షానికి ఆయుధాలయ్యాయి. 





హిందుపురంలో కూడా ఎన్నికల్లో టీడీపీని ఓడించాలని జగన్ చాలా పట్టుదలగా ఉన్నారు. దీంతో మృతుడు పార్టీకోసం బాగా కష్టపడుతున్నారు. మృతుడికి ఎంఎల్సీకి ఏమాత్రం పడదట. మామూలుగానే హిందుపురంలో టీడీపీ చాలా స్ట్రాంగ్. జగన్ చేసిన తప్పుల వల్ల పార్టీ ఇక్కడ బలహీనమైపోయింది. ఈ బలహీనతలమీద ఇపుడు రామకృష్ణారెడ్డి హత్య. దీంతో పార్టీ అధిష్టానం మీద పార్టీలోని జనాలంతా మండిపోతున్నారు. గొడవలను సర్దుబాటు చేయలేదని ఒకమంట అయితే చనిపోయిన తర్వాత పార్టీ అగ్రనేతల్లో ఎవరు కనీసం కుటుంబాన్ని పరామర్శించటానికి కూడా రాలేదని మరో మంట.





ఈ రెండు కారణాలతో పార్టీ అధిష్టానాన్ని అందరు తప్పుపడుతున్నారు. జగన్ గనుక సకాలంలో స్పందించి ఇక్బాల్ ను కంట్రోల్లో పెట్టుంటే రామకృష్ణారెడ్డి హత్య జరిగేది కాదని పార్టీలోని చాలామంది నమ్ముతున్నారు. సో క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీని వైసీపీ నేతలే గెలిపించేస్తారా అనే అనుమానాలున్నాయి. ఎందుకంటే ఇక్బాలే వచ్చే ఎన్నికల్లో కూడా క్యాండిడేట్ అనే ప్రచారం జరుగుతోంది. ఇక్బాలే పోటీచేస్తే ఫలితం టీడీపీకే అనుకూలమంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: