అమరావతి : అయోమయంతో ఏమి మాట్లాడాలో తెలీటంలేదా ?

Vijaya





పాపం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్దితి చివరకు ఇలాగ అయిపోయింది. ఎన్నికలకు రెండేళ్ళుందనగానే పవన్ పరిస్దితి ఇలాగైపోతే ఇక ఎన్నికల సమయానికి ఎలాగుంటుందో అర్ధం కావటంలేదు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా పవన్ రెండురోజుల నుండి వరసగా ట్వీట్లు చేస్తునే ఉన్నారు. ట్విట్టర్ ద్వారా ప్రభుత్వానికి అనేక ప్రశ్నలను సంధిస్తున్నారు. మంగళవారం నాటి ట్వీట్లో మూడు రాజధానులే ఎందుకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మార్చేస్తే 25 జిల్లాలను 26 రాష్ట్రాలుగా మార్చేయచ్చుకదాని అడిగారు.





నిజమే పవన్ చెప్పింది బాగానే ఉంది కానీ ఆపని జగన్మోహన్ రెడ్డి చేతిలో లేదు. అందుకు పార్లమెంటు, కేంద్రప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదం అవసరం. సరే ఇపుడు పవన్ వ్యతిరేకతను గమనిస్తే జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులను పవన్ నూరుశాతం వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇదే పవన్ ఒకపుడు కర్నూలుకు వెళ్ళారు. అక్కడ జరిగిన బహిరంగసభలో మాట్లాడుతు చంద్రబాబు అమరావతిని రాజధానిగా చేసినా తనవరకు కర్నూలే రాజధానంటు ప్రకటించారు.





అంటే పవన్ ప్రకటనకు అర్ధమేంటి ? అమరావతిని రాజధానిగా అంగీకరించననే కదా. అలాగే మరోసారి వైజాగ్ వెళ్ళారు. అక్కడ మాట్లాడుతు వైజాగ్ ను రాజధానిగా చేసుంటే బాగుండేదని అన్నారు. రాజధాని అయ్యేందుకు వైజాగ్ కు అన్నీ అర్హతలు ఉన్నాయని గట్టిగా చెప్పారు. సీన్ కట్ చేస్తే అప్పట్లో పవన్ రెండు కోరికలను ఇపుడు జగన్ నెరవేరుస్తున్నారు కాదా.




కర్నూలును టోటల్ రాజధానిగా కాకపోయినా న్యాయరాజధానిగా మార్చాలని ప్రతిపాదించారు కదా. మరి దీనికోసమైనా జగన్ కు పవన్ మద్దతివ్వాలి కదా. అయినా జగన్ కు కాదని చంద్రబాబునాయుడుకే ఎందుకు మద్దతుగా నిలుస్తున్నట్లు ? వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా చంద్రబాబు ప్యాకేజీల కోసమే పవన్ పనిచేస్తున్నారా ? జనాలు కూడా ఇలాగే అనుకుంటే అది వాళ్ళ తప్పు ఎలాగవుతుంది ? ఎప్పటికప్పుడు అభిప్రాయాలు, మాటలు మార్చేసే తనలాంటి వాళ్ళని జనాలు ఆదరించరని పవన్ ఎంత తొందరగా తెలుసుకుంటే అంతమంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: