హైదరాబాద్ : కేసీయార్ కు ఊహించని షాకిచ్చిన మాజీ ఎంపీ

Vijaya






మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల సమయంలో కేసీయార్ కు ఊహించని పెద్ద షాక్ తగిలింది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీకి దూరమైపోయారు. శనివారం గౌడ్ బీజేపీలో చేరబోతున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం బూర ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. గురువారం మునుగోడు అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కూడా బూర పాల్గొన్నారు.



నామినేషన్ కార్యక్రమం అయిన తర్వాత రహస్యంగా బీజేపీ నేతలతో భేటీ అయ్యారట. వాళ్ళమధ్య ఏమి చర్చలు జరిగింది ? బూరకు ఎలాంటి హామీ వచ్చిందో తెలీదు. హఠాత్తుగా బూర నియోజకవర్గంలో మాయమైపోయి ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. నిజానికి మునుగోడు టికెట్ కోసం బూర విశ్వప్రయత్నాలు చేశారు. అయితే కేసీయార్ మాత్రం మాజీ ఎంపీకి కాకుండా మాజీ ఎంఎల్ఏకే టికెట్ ప్రకటించారు. టికెట్ ను కూసుకుంట్లకే ఇస్తారని అందరికీ తెలుసు. అందుకనే మొదటినుండి కేసీయార్ ను బూర టార్గెట్ చేస్తున్నారు.



బూర ఎంత ప్రయత్నించినా టికెట్ దక్కకపోవటంతో బాగా అసంతృప్తిగా ఉన్నారు. కేసీయార్ సర్దిచెప్పినపుడు ఏమీ మాట్లాడని బూర చివరకు బీజేపీలో చేరటానికి డిసైడ్ అయ్యారు. బూర ఆర్గ్యుమెంట్ ఏమిటంటే నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉంది కాబట్టి ఉపఎన్నికలో టికెట్ బీసీకే ఇవ్వాలని. కేసీయార్ గనుక బీసీకే టికెట్ ఇవ్వాలని అనుకుంటే తాను బీసీనే కాబట్టి టికెట్ తనకే వస్తుందని ఆశించారు.




అయితే బూర ఎంతగా ప్రయత్నించినా కేసీయార్ టికెట్ కూసుకుంట్లకే ఇచ్చారు. బూర చెప్పినట్లుగా సుమారు 2.3 లక్షల ఓట్లున్న నియోజకవర్గంలో 60 శాతం ఓట్లు బీసీలవే. అందులోను గౌడ్లవే ఎక్కువ కావటంతో బూర టికెట్ పై బాగా ఆశలు పెట్టుకుని చివరకు నిరాసకు గురయ్యారు. దాని కారణంగానే ఇపుడు బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వెళిపోతున్నారు. నిజంగా కేసీయార్ ఈ విషయాన్ని ఏమాత్రం ఊహించుండరనే చెప్పాలి. మరీ దీని ప్రభావం ఎవరిమీద ఎతుంటుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: