శనివారం నాడు విశాఖలో ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో మూడు రాజధానులకు సపోర్ట్ గా గర్జన జరిగింది. జేఏసీ కార్యక్రమంలో అధికార పార్టీ వైసీపీ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జోరు వాన కురుస్తున్నా నగరంలో భారీ ర్యాలీ చేశారు. ఆ తరువాత జరిగిన సభలో మాట్లాడిన మంత్రులు.. చంద్రబాబుతో పాటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారు. తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి జపం చేస్తున్నారని ఆరోపించారు. విశాఖ గర్జనలో మాట్లాడిన మంత్రి రోజా.. జనసేన చీఫ్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కు పెళ్లి చేసుకోవడానికి విశాఖ అమ్మాయి కావాలి.. యాక్టింగ్ కోసం విశాఖ కావాలి.. చివరకు పోటీ చేయడానికి విశాఖ గాజువాక కావాలి.. కాని విశాఖ పాలన రాజధాని మాత్రం కావొద్దా అంటూ రోజా కామెంట్ చేశారు.విశాఖ గర్జనలో తనపై మంత్రి రోజా చేసిన కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు పవన్ కల్యాణ్. విశాఖలో తాను యాక్టింగ్ చేస్తే విశాఖ రాజధాని కావాలా అని కామెంట్ చేశారు. నేను ముంబైలో యాక్టివ్ చేశాను కాబట్టి.. దేశానికి ముంబై రాజధాని కావాలా అని సెటైర్ వేశారు. అమరావతే ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా ఉండాలన్నది జనసేన పార్టీ విధానమన్నారు. ఎప్పటికి తాము అదే అభిప్రాయంతో ఉంటామన్నారు పవన్ కల్యాణ్. రాజు మారితే రాజధాని మురుస్తారా అని ప్రశ్నించారు.
వైసీపీ నేతలను విశాఖను కొల్లగొట్టడానికే పరిపాలనా రాజధాని అంటున్నారని విమర్శించారు. ఒక వ్యక్తి నిర్ణయం తీసుకుంటే.. మిగితా వాళ్లు వికేంద్రీకరణపై మాట్లాడుతారని అన్నారు. సీఎం జగన్ నిర్ణయాల వల్ల ఏపీ నుండి సంస్థలన్నీ వెళ్లిపోయాయని.. ఆయన ఒక్కడే తీసుకునే నిర్ణయాల వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. జగన్ ఒక్కడే అధికారం చెలాయించాలి కానీ.. రాజధానులు మాత్రం మూడు కావాలా అని ప్రశ్నించారు. తాము తలపెట్టిన జనవాణి కార్యక్రమ ఎజెండాలో రాజధాని అంశం లేదన్నారు. ఎయిర్‌పోర్టు దగ్గర పోలీసుల ప్రవర్తన సరిగా లేదన్నారు. పోలీస్ శాఖపై తనకు ప్రత్యేక గౌరవం ఉందన్న జనసేనాని.. పోలీసులు ప్రభుత్వ సూచనలను పాటిస్తున్నారని చెప్పారు. జనసేన కార్యకర్తలపై పోలీసులు జులుం చూపారని పవన్ కళ్యాణ్ కోపంతో మండిపడ్డారు.వైసీపీ మూడు రాజధానుల కార్యక్రమానికి ముందే జనవాణి కార్యక్రమం ఖరారైందని పవన్ కల్యాణ్ అన్నారు.
తమ పార్టీ కార్యక్రమాలు ఎలా చేసుకోవాలో కూడా వైసీపీ చెబుతుందా అని నిలదీశారు. ఉత్తరాంధ్ర పర్యటనను 3 నెలల క్రితమే ఖరారు చేశామని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే జనవాణి కార్యక్రమం చేపట్టామని చెప్పారు. వైసీపీ నేతలవి ఎప్పుడు బూతు పురాణాలే తప్ప.. సమస్యలను పరిష్కారించలేదని ఆరోపించారు. వైసీపీకి పోటీగా కార్యక్రమాలు చేయాలనేది తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో పోటీ పెట్టుకుందామని అన్నారు.ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేదన్న వ్యక్తి కిందే... ఇప్పుడు పోలీసులు పనిచేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. జనసేన కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారని విమర్శంచారు. వైఎస్ వివేకా హత్య కేసును ఇంతవరకు ఎందుకు పరిష్కరించలేదని పవన్ కళ్యాణ్ నిలదీశారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.