వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్..ఫోటోలు, వీడియోలు..
ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సాప్ ను ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. సోషల్ మీడియా వినియోగం పెరగడం తో వాట్సాప్ యూజర్స్ కూడా భారీగా పెరుగుతున్నారు.కస్టమర్లకు మరింత సేవలను అందిస్తూ వస్తుంది..సెక్యురిటి పరంగా కొత్త ఫీచర్లను అందిస్తూ వస్తున్నారు..తాజాగా మరో కొత్త ఫీచర్ ను అందిస్తుంది.త్వరలో ఫార్వార్డింగ్ మెసేజ్‌లలో మెరుగుదలలను తీసుకురాబోతోంది. దీనిని ప్రస్తుతం వాట్సాప్ బీటా అప్‌డేట్‌లో చూడవచ్చు. దీని కింద వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలను ఫార్వార్డ్ చేస్తూ క్యాప్షన్‌లు రాసుకునే సదుపాయం ఉంటుంది.
ప్రస్తుతం, మీరు ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన వాట్సాప్‌లో వీడియో లేదా ఫోటో మెసెజ్ ఫార్వార్డ్ చేసినప్పుడల్లా మీరు దానితో క్యాప్షన్‌ను పంపలేరు. కానీ తాజాగా మార్చిన తర్వాత ఈ సమస్య పూర్తిగా మారిపోయింది. ఈ ఫీచర్ రావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఎందుకంటే ఈ ఫీచర్ ప్రస్తుతం డెబులపింగ్ స్టేజ్‌లో ఉంది. ఈ ఫీచర్‌కి సంబంధించిన తాజా నివేదికలో అందించిన సమాచారాన్ని మనం తెలుసుకుందాం.
వాట్సప్ రాబోయే ఫీచర్లను పర్యవేక్షించే Wabetainfo తాజా నివేదిక ప్రకారం, వాట్సప్ త్వరలో ఆన్రైడ్‌లో వాట్సప్ బీటా 2.22.23.4 అప్‌డేట్‌లో మొదటిసారిగా కనిపించిన ఆసక్తికరమైన ఫీచర్‌ను అప్‌డేట్ చేయబోతోంది. ఇప్పుడు వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలు, జీఏఎఫ్‌లు, డాక్యుమెంట్‌లను ఫార్వార్డ్ లేదా షేర్ చేయగలరని, అలాగే వాటి క్యాప్షన్‌లను ఫార్వార్డ్ చేయడం లేదా షేర్ చేయవచ్చని తాజా రిపోర్టులో తెలిపింది.ఈ ఫీచర్‌కి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు కూడా నివేదికలో కనిపించాయి.
అందులో వాట్సాప్ కొత్త ఇంటర్‌ఫేస్ కనిపించింది. ఈ ఫీచర్ పూర్తిగా అప్‌డేట్ చేయబడినప్పుడు. దీని కోసం అప్‌డేట్ చేయబడిన తర్వాత, ఏదైనా మీడియా ఫైల్‌ను దానికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసుకోవచ్చు. ఈ కాలమ్‌లో యూజర్లు తమ కాంటాక్ట్‌లకు ఫోటోలు, వీడియోలకు సంబంధించిన ఏదైనా టైటిల్స్ లేదా మెసెజ్‌ను పంపగలరు.అలాగే క్యాప్షన్ లేకుండా కూడా మీ ప్రియమైన వారికి ఫోటోలు సెండ్ చెయ్యొచ్చు..