ఆ నియోజకవర్గంలో వైసీపీ ని దాటి టీడీపీకి గెలిచే ఛాన్స్ ?

VAMSI
కృష్ణా జిల్లాలోని ఒక నియోజకవర్గం వైసీపీ శ్రేణులకు షాక్ ఇచ్చేలా ఉంది. గత ఎన్నికల్లో గెలిచిన ఆ సీటు పై ఇప్పుడు సందిగ్దత నెలకొంది. నూజివీడు నియోజకవర్గం ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈయన ఎన్నికల్లో గెలిచిన అనంతరం మంత్రి వర్గంలో తనకు చోటు దక్కుతుందని భావించారు. కానీ నిరాశే ఎదురయింది, కనీసం రెండవ సారి అయినా జగన్ కనికరిస్తాడు అనుకుంటే మొన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలోనూ చోటు దక్కకపోవడంతో అలకబూనారు. ఇది కాకుండా అనారోగ్య కారణంగా కూడా ఇంతకు ముందులా దూకుడుగా వ్యవహరించడంలో ఫెయిల్ అవుతున్నారు.

అందుకే రాబోయే ఎన్నికలలో నూజివీడు నియోజకవర్గంలో తన రాజకీయ వారసుడిని రంగంలోకి దింపాలని ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ జగన్ మాత్రం వారసులకు టికెట్ ఇచ్చేది లేదని ఇప్పటికే చెప్పి ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుండి కూడా తానూ దూరంగా ఉంటూ వచ్చి నియోజకవర్గంలో కొడుకునే చురుకుగా ప్రజల్లో తిరిగేలా చేశాడు. ఇప్పడు ఎక్కడ రివర్స్ అవుతుందో అని అంతర్మథనంలో పడ్డాడు. ఇక మిగిలిన ఈ ఒకటిన్నర సంవత్సరంలో రంగం లోకి దిగినా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం కష్టమే అవుతుంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ చాలా వీక్ అయినప్పటికీ ఈ విషయాన్ని కనుక సరిగా వినియోగించుకుని ప్రజల్లోకి తీసుకు వెళితే ఖచ్చితంగా పుంజుకునే అవకాశాలు ఉంటాయి.

కాగా టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు... పెద్దగా నియోజకవర్గంలో తిరిగింది లేదు. ఇప్పుడు మిగిలిన ఈ కొద్ది సమయాన్ని కనుక వెంకటేశ్వరరావు సరిగా వినియోగించుకుంటే ఎమ్మెల్యే గా గెలిచే అవకాశం ఉంది. అలా కాకుండా జగన్ కనుక వారసుడు పోటీ చేయడానికి అనుమతి ఇస్తే వైసీపీకి ఆ సీటు దక్కుతుంది. ఏమి జరుగుతుందో తెలియాలంటే ఎన్నికల ముందు వరకు ఆగాల్సిందే.  




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: