అజ్ఞాతంలో టీవీ5 చైర్మన్ బీఆర్.నాయుడు.. సీఐడీ నోటీసులే కారణమా..?

shami
టీవీ5 చైర్మన్ బీ.ఆర్ నాయుడు గత ఐదు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. దీనికి కారణం ఆయనకు ఏపీ సీఐడీ నుంచి నోటీసులు రావడమే కారణమని అంటున్నారు. ఈ నెల 19న బీ.ఆర్ నాయుడికి సీఆర్పీసీ 41ఏ సెక్షన్ ని అనుసరిస్తూ 24వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. కరోనా టైం లో 2005 విపత్తు నిర్వహణ యాక్ట్ ని ఉల్లంఘించి ప్రజలను ఎక్కువ భయభ్రాంతులను గురి చేసేలా కథనాలు ప్రసారం చేశారని.. ఆ విపత్కర సమయాల్లో వైద్యుల గురించి.. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గురించి ఆత్మస్థైర్యం కోల్పోయేలా అవాస్తవ కథనాలు ప్రసారం చేసినందుకు నమోదైన కేసు విషయంపై విచారణ కు బీ.ఆర్ నాయుడికి నోటీసులు వచ్చాయి.
ఏపీ సీఐడీ నుంచి నోటీసులు వచ్చిన అనంతరమే బీ.ఆర్ నాయుడు అజ్ఞాతంలో కి వెళ్లారని అంటున్నారు. ఐదారు రోజులుగా బీ.ఆర్ నాయుడు టీవీ 5 సిబ్బందికి కానీ.. బంధుమిత్రులకు ఎవరికి అందుబాటు లో లేరని సమాచారం. అంతేకాదు తనకు ఇచ్చిన సీఐడీ నోటీసుపై స్టే కోరుతూ బీ.ఆర్ నాయుడు ఏపీ హైకోర్ట్ ని ఆశ్రయించారు.. అయితే ఉన్నత న్యాయస్థానం స్టే కూడా మంజూరు చేసింది. కోర్ట్ స్టే విధించినా సరే బీ.ఆర్ నాయుడు కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లడం అనుమానాలకు దారి తీస్తుంది.
అసలు బీ.ఆర్ నాయుడు అజ్ఞాతంలో కి ఎందుకు వెళ్లారు. ఏపీ సీఐడీ నోటీసులకే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారా లేక మరే కారణమైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది. హై కోర్ట్ నుంచి స్టే ఆర్డర్ వచ్చినా సరే ఈ కేసు విషయమై ఆయన కనిపించకుండా వేళ్లారని అనుకోవడం మాత్రం ఆశ్చర్యకరం గా ఉంది. అసలు బీ.ఆర్ నాయుడు ఎక్కడికి వెళ్లారు..? ఎందుకు ఆయన అజ్ఞాతంలో ఉన్నారు..? ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే ఆయన కనిపించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: