ఢిల్లీ : జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు

Vijaya






‘తనపైన ఉన్న కేసుల్లోనుండి జగన్మోహన్ రెడ్డి తొందరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారు’ ...ఇది తాజాగా వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్య. ఈ మాట ఇంకెవరైనా అంటే నమ్మచ్చేమో కానీ స్వయంగా తిరుగుబాటు ఎంపీనే అంటే ఎవరైనా నమ్ముతారా ? కానీ నమ్మితీరాలి ఎందుకంటే ఢిల్లీలో రచ్చబండ పేరుతో పెట్టిన మీడియా సమావేశంలో ఆయనే చెప్పారు కాబట్టి.



అక్రమాస్తుల ఫిర్యాదుపై జగన్ పైన చాలా కేసులు నమోదైన విషయం తెలిసిందే. కేసుల విచారణలో భాగంగా సాక్ష్యాలులేవని కోర్టులు కేసులు కొట్టేస్తున్నాయి. క్విడ్ ప్రోకో జరిగిందని ఈడీ, సీబీఐ నమోదుచేసిన కేసులన్నింటినీ ఒకటి తర్వాత మరొకటి వీగిపోతున్నాయి. అయితే సాక్ష్యులను బెదిరిస్తున్నారు కాబట్టి జగన్ బెయిల్ ను వెంటనే రద్దుచేయాలంటు తిరుగుబాటు ఎంపీ రఘురాజు సుప్రింకోర్టులో వేసిన పిటీషన్ను కోర్టు కొట్టేసింది.



ఈ నేపధ్యంలోనే ఎంపీ మాట్లాడుతు ప్రతివాదులను పిలిపించి విచారణ చేయాలన్న తన వాదనను కోర్టు పరిగణలోకి తీసుకోలేదని తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. దాంతోనే కేసు తీర్పును తాను ఊహించానన్నట్లుగా చెప్పారు. జగన్ పైన ఉన్న కేసులను కోర్టులు కొట్టేస్తున్న నేపధ్యంలో సీఎం పులుకడిగిన ముత్యంలాగ బయటపడతారని జనాలంతా అనుకోవటంలో తప్పులేదన్నారు. తాను కూడా జగన్ కడిగిన ముత్యంలాగ బయటపడాలనే కోరుకుంటున్నట్లు చెప్పారు. తనపైన ఉన్న కేసుల్లోనుండి క్లీన్ చిట్ తో బయటపడమని తాను గతంలోనే జగన్ కు సూచించినట్లు ఇపుడు చెబుతున్నారు.




ఒకవైపు జగన్ బెయిల్ రద్దుచేయించి జైలుకు పంపాలని ఎంపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎంపీ వాదనలో పసలేదని కోర్టులు కేసులను కొట్టేస్తున్నాయి. దాంతో జగన్ను కోర్టులో కేసులు వేసి ఏమిచేయలేనని ఎంపీకి అర్ధమైపోయినట్లుంది. అందుకనే ఏమి మాట్లాడలో దిక్కుతోచక కేసుల నుండి జగన్ పులుకడిగిన ముత్యంలాగ బయటపడతారంటు కొత్త రాగం అందుకున్నారు. కేసులన్నాక ఒక్కోసారి మనకు చుక్కెదురవుతుందన్న విషయం తనకు తెలుసన్నారు. ఎంపీ వ్యవహారం చూస్తుంటే తెల్లజెండా ఊపుతున్నట్లే ఉంది.  కోర్టులో తనకు చుక్కుదురైనా రేపటి ఎన్నికల్లో ప్రజాకోర్టు ఏమి తీర్పు చెబుతుందో చూడాలంటు తన అక్కసును ప్రదర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: