హైదరాబాద్ : పవన్ కు ప్రాణహాని ఉందా ? జగన్ వెరీలక్కీ

Vijaya






జనసేన అధినేత పవన్ కల్యాణ కు ప్రాణహాని ఉందన్నట్లుగా ఆ పార్టీ నేతలు చేసిన గోల అంతా ఇంతా కాదు. ఎల్లోమీడియా అయితే ఈ విషయంలో  నానా రచ్చ చేసేసింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతు పవన్ ఇంటి దగ్గర రెక్కీ జరిగిందన్నారు. గుర్తుతెలీని వ్యక్తులు పవన్ కార్లను ఫాలో అవుతున్నారని చెప్పారు. ఇంటిముందు పెద్ద గొడవకూడా అయ్యిందంటు గోలచేశారు.





జనసేన తెలంగాణా ఇన్చార్జి శంకర్ గౌడ్, ఇంటిదగ్గర సెక్యూరిటిగా పనిచేస్తున్న ఒక బౌన్సర్ తో జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు కూడా ఇప్పించారు. దీనిపట్టుకుని పవన్ ప్రాణాలకు ముప్పందంటు ఎల్లోమీడియాలో  నానా గోల జరిగిపోయింది. తీరాచూస్తే అది తాగుబోతుల వ్యవహారంగా తేలిపోయింది. బౌన్సర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఇద్దరు యువకులను పట్టుకుని విచారించారు. విషయం ఏమిటంటే పవన్ ఇంటికి దగ్గరలోనే ఒక పబ్ ఉందట. అక్కడ ఫుల్లుగా మందుకొట్టేసిన యువకులు పవన్ ఇంటిదగ్గర తమ కారును నిలిపారు.





పవన్ ఇంటిముందు నిలిపిన కారును తీసేయమని బౌన్సర్లు చెప్పినపుడు వాళ్ళ మధ్య మాటమాట పెరిగింది. అదికాస్త గొడవకు దారితీసి కొట్టుకునేస్ధాయికి చేరుకుంది. దాంతో బౌన్సర్లు ఆ యువకులపై ఫిర్యాదు చేశారు. వాళ్ళని స్టేషన్ కు తీసుకొచ్చిన తర్వాత యువకులు జరిగిన విషయాలు పోలీసులతో చెప్పారు. దాంతో వాళ్ళకి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు.





పోలీసుల ద్వారా బయటకు వచ్చిన విషయం ఇలాగుంటే నాదెండ్ల, ఎల్లోమీడియా, బీజేపీ అద్యక్షుడు సోమువీర్రాజు అండ్ కో మాత్రం నానా రచ్చ చేయటమే ఆశ్చర్యంగా ఉంది. అసలు పవన్ ప్రాణాలకు ఎవరినుండి ముప్పుంది ? పవన్ను జనాలు ఇప్పటికీ రాజకీయనేతగా చూడటంలేదు. కాకపోతే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని అదృష్టవంతుడనే చెప్పాలి. ఎందుకంటే పవన్ ఇల్లు హైదరాబాద్ లో ఉందికాబట్టి సరిపోయింది. తాగుబోతల గొడవ కూడా హైదరాబాద్ లోనే జరిగింది కాబట్టి జగన్ సేఫ్ అయిపోయారు. ఇదే ఘటన ఏపీలో ఎక్కడైనా జరిగుంటే ఇంకేమన్నా ఉందా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: