అమరావతి : ఫోర్జరీ కేసులో టీడీపీ ముఖ్య నేతల అరెస్టు
కోర్టుకు నకిలీ సర్టిఫికేట్లు సమర్పించటం, కొన్ని డాక్యుమెంట్లలో అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన నేరానికి సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కొడుకు చింతకాయల విజయ్ ఇద్దరినీ సీఐడీ పోలీసులు అరెస్టుచేశారు. గురువారం తెల్లవారుజామున సీఐడీ పోలీసులు ఒకేసారి ఇద్దిరినీ అరెస్టుచేయటం గమనార్హం. వీళ్ళిద్దరిపైన ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యున్నాయి. ఎప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకోవాలని వెళ్ళినా వీళ్ళిద్దరు తప్పించుకుని పారిపోతున్నారు.
విచారణకు నోటీసులు ఇవ్వటానికి పోలీసులు వెళ్ళినా తప్పించుకుంటున్నారు. పైగా ఎదురు పోలీసుల మీదే ఆరోపణలు చేస్తు ఫిర్యాదులు చేస్తున్నారు. పోలీసులు తమను అరెస్టు చేయకుండా కోర్టుల్లో లొంగిపోవటం ముందస్తు బెయిల్ తెచ్చుకోవటం అలవాటుగా మారిపోయింది. అందుకనే వ్యూహాత్మకంగా తండ్రి, కొడుకులకు తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా తెల్లవారుజామున ఇంటిపై దాడిచేసి అరెస్టుచేశారు.
జగన్మోహన్ రెడ్డిని నోటికొచ్చినట్లు బూతులు తిట్టడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తండ్రి కొడుకుల స్పెషాలిటి అని మంత్రులు, వైసీపీ నేతలు ఎన్నోసార్లు ఆరోపించారు. అయినా వీళ్ళపద్దతి ఏమీ మారలేదు. అయితే తాజా అరెస్టు మాత్రం నకిలి సర్డిఫికేట్లు, డాక్యుమెంట్ల ఫోర్జరీకి పాల్పడ్డారని జరిగింది. ఇంటి నిర్మాణానికి సంబంధించి పంటకాల్వను ఆక్రమించి కాంపౌండ్ వాల్ కట్టేసుకున్నారు. ఈ విషయమై గతంలోనే వీళ్ళపైన ఫిర్యాదులు రావటం, విచారణ కోసమని వెళ్ళిన పోలీసులను నోటికొచ్చినట్లు తిట్టడం అందిరికీ తెలిసిందే. తాము పంటకాల్వను ఆక్రమించుకోలేదని వీళ్ళు చెబుతున్నారు.
చివరకు కోర్టు ఆదేశాల ప్రకారం ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు కొలతలు వేసినపుడు 2 సెంట్ల పంటకాల్వ భూమిని వీళ్ళు ఆక్రమించుకున్నట్లు తేలింది. దాంతో అరెస్టుచేయటానికి వెళితే తండ్రి, కొడుకులు తప్పించుకుని పారిపోయారు. చివరకు వీళ్ళు చూపించిన డాక్యుమెంట్లలోని సంతకాలు, నో అబ్డెక్షన్ సర్టిఫికేట్లు కూడా తప్పుడువే అని తేలింది. చింతకాయల మంత్రిగా ఉన్నపుడు అధికారులను బెదిరించి సంతకాలు చేయించుకున్నట్లు, కొన్ని సంతకాలు వాళ్ళే చేసిశారని సీఐడీ అధికారులు చెబుతున్నారు. వీళ్ళను అరెస్టుచేయగానే చంద్రబాబునాయుడు దగ్గర నుండి కిందిస్ధాయివరకు తమ్ముళ్ళు గోలగోల చేస్తున్నారు.