ఉత్తరాంధ్ర : పార్టీల మధ్య గొడవలు పెడుతున్న ఎల్లోమీడియా

Vijaya







తోచీ తోచనమ్మ తోడికోడలు పుట్టింటికెళ్ళిందనే సామెతలాగ తయారైపోయింది ఎల్లోమీడియా వ్యవహారం. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు, కథనాలు అచ్చేయాలన్నది టార్గెట్. అందుకనే ఉన్నదీ లేనిదీ అన్నింటినీ పోగేసి ప్రతిరోజు ఏదేదో రాసేస్తోంది. బహుశా రాయటానికి ఏమీ దొరకలేదేమో వైసీపీ-బీజేపీ మధ్య గొడవలు పెట్టేందుకు ప్రయత్నాలు చేసింది. ఈనెల 11,12 తేదీల్లో విశాఖపట్నంకు నరేంద్రమోడీ వస్తున్నారు. మోడీ రాకను తన పిచ్చిరాతలకు వేదికగా మార్చుకున్నది.




ఇంతకీ విషయం ఏమిటంటే మోడీ రాకసందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లలో బీజేపీ నేతలను ప్రభుత్వం దూరంగా పెట్టేసిందని రాసింది. మోడీ రాకసందర్భంగా నిర్వహించాలని అనుకుంటున్న బహిరంగసభ వేదికమీదకు బీజేపీ నేతలను దూరంగా ఉంచేందుకు వైసీపీ కుట్రచేస్తోందని, దానిపై కమలనాదులు బాగా మండుతున్నారంటు ఒక పిచ్చి కథనాన్ని అచ్చేసింది. రెండు రోజుల ప్రధానమంత్రి ప్రోగ్రామ్ లో మోడీతో ఎవరెవరు పాల్గొనాలన్నది పూర్తిగా ప్రధానమంత్రి కార్యాలయమే నిర్ణయిస్తుంది.



మోడీ పాల్గొంటున్న రెండురోజుల పర్యటన పూర్తిగా అధికారికం. ఇందులో పార్టీలకు ఎలాంటి సంబంధంలేదు. రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కచ్చితంగా మోడీతో పాటు జగన్ కూడా ఉంటారు. ఇక కార్యక్రమాలను బట్టి ఆయా శాఖల మంత్రులు, స్ధానిక ఎంపీ, స్ధానిక ఎంఎల్ఏలు ఉంటే ఉండచ్చు. కార్యక్రమాలు ఏమిటి ? ఎవరెవరు పాల్గొంటారనే జాబితాను రాష్ట్రప్రభుత్వం ప్రధానమంత్రి ఆపీసుకు అందిస్తుంది.



వివరాలన్నింటినీ పరిశీలించిన తర్వాత కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన వాళ్ళ జాబితాను పీఎంవోనే ఫైనల్ చేస్తుంది. ఇందులో  ముఖ్యమంత్రి కార్యాలయానికి, వైసీపీకి ఎలాంటి సంబంధంలేదు. అంతా ప్రోటోకాల్ ప్రకారమే జరుగుతుంది. బహిరంగసభ ఏర్పాట్లను ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు, కలెక్టర్, ఎస్పీ చూస్తున్నారంటే ప్రభుత్వం తరపున ఏర్పాట్లు చూడటంతో తప్పేముంది ? ఈ విషయంలో బీజేపీ నేతలను దూరంగా పెట్టేస్తున్నారనటంలో అర్ధమేలేదు. బీజేపీ ఏమీ ఏపీలో అధికారపార్టీ కాదు. వీళ్ళల్లో ఎవరైనా మోడీ పాల్గొనే కార్యక్రమాల్లో పాల్గొనాలంటే పార్టీ ద్వారా పీఎంవోతో మాట్లాడుకుని జాబితాలో పేరుండేట్లుగా చూసుకోవాలి. వాస్తవం ఇదైతే  వైసీపీ-బీజేపీ మధ్యలో గొడవలు పెట్టేందుకు ఎల్లోమీడియా బాగానే ప్రయత్నాలు చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: