ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వడం కోసం ఎన్నెన్నో కొత్త మార్గాల ను ఎంచుకుంటున్నారు.. కొత్త కొత్త కంటెంట్ తో జనాలకు పిచ్చేక్కిస్తున్నారు. ఒకప్పుడు ప్రాంక్ అంటే నలుగురిని నవ్వించడానికి ఉపయోగపడేది.. కాని ఇప్పుడు అదే నలుగురిని ఇబ్బంది పెడుతోంది. ఈ మధ్యకాలం లో యువత ప్రాంకుల పేరుతొ వెకిలి చేష్టలు చేస్తున్నారు. ఇక మరికొందరు అయితే.. కాస్త హద్దు దాటి మరీ.. బోల్డ్ కంటెంట్ తో పాపులారిటీ సంపాదించు కుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి కేరళ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కేరళకి చెందిన ఇద్దరు యువకులు ప్రాంక్ పేరిట వెకిలి చేష్టలు చేశారు. వాళ్లిద్దరూ జోరు వాన లో ఓ బైక్ పై వెళ్తూ.. అర్ధనగ్నంగా స్నానం చేశారు. అంతేకాదు స్నానం చేయడానికి సోప్ కూడా ఉపయోగించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కూడా వీరి వెకిలి చేష్టలు కంటిన్యూ కావడం తో అక్కడున్న వారంతా ఆ ఇద్దరిని వీడియో తీశారు. అది సోషల్ మీడియా లో వైరల్ కావడం తో మ్యాటర్ పోలీసుల వరకు వెళ్ళింది..
వెంటనే రంగంలోకి దిగిన పొలిసులు యువకులకు వరుస షాక్ లు ఇచ్చారు. ఆ యువకులు భరణిక్కవు కు చెందిన అజ్మల్, బాదుషాలుగా గుర్తించారు. అనంతరం వారిని కస్టడీ లోకి తీసుకున్న పోలీసులు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి.. రూ. 5 వేలు జరిమానా విధించారు. కాగా, తాము ఓ ఈవెంట్ నుంచి తిరిగి ఇంటికి వస్తున్నామని.. వాన పడుతుండటం తో సరదా కోసం ప్రాంక్ చేశామని చెప్పారు. ఇది విన్న పోలీసులు ఫైన్ కట్టాల్సిందె అనడం తో తప్పక,ఇంక చేసెదెమి లేక అడిగినం త చెల్లించాల్సి వచ్చింది.. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.. కామెంట్లు కూడా అందుకుంటుంది..