ఆధార్ తోనే యూపిఐ యాక్టివేట్..కొత్త సేవలు అందుబాటులోకి..

Satvika
ఆధార్ అన్నీ సేవలకు ముఖ్యం అన్న సంగతి తెలిసిందే.. కొన్ని సేవలను పొందేందుకు ఈ ఆధార్ తప్పనిసరి. ఇకపోతే యూపీఐ యాక్టివేట్ చేసుకోవాలంటే.. తప్పనిసరిగా వాలిడ్ డెబిట్ కార్డు వివరాలు కావాల్సి ఉండేది. యూపీఐ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో యూపీఐ పిన్‌ ను సెట్ చేసుకునేందుకు ఈ కార్డు వివరాలు తప్పనిసరి. కానీ ఇక నుంచి ఇది అవసరం లేదు. ఆధార్ ఉంటే చాలు. ఆధార్ ఓటీపీతోనే ఇక నుంచి యూపీఐ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఈ సేవలు తొలిసారి దేశ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది ఫోన్‌పే సంస్థ..


ఆధార్ ఆధారిత ఓటీపీ అథెంటికేషన్‌ను వాడుతూ యూపీఐను యాక్టివేట్ చేసుకునే విధానాన్ని దేశంలో లీడింగ్ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే అమల్లోకి తెచ్చింది. ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి యూపీఐ థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ యాప్‌ ఫోన్‌పేనే. కోట్లాది మంది భారతీయులలో భాగం చేయాలనే ఉద్దేశ్యంతో ఆధార్ బేస్డ్ యూపీఐ ఆన్‌బోర్డింగ్‌ను తీసుకొచ్చినట్టు ఫోన్‌పే తెలిపింది. ఇది పూర్తిగా సురక్షితమైన ప్రక్రియని సంస్థ పేర్కొంది. యూపీఐ యాక్టివేట్ చేసుకోవాలంటే.. తప్పనిసరిగా వాలిడ్ డెబిట్ కార్డు వివరాలు కావాల్సి ఉండేది. యూపీఐ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో యూపీఐ పిన్‌ను సెట్ చేసుకునేందుకు ఈ కార్డు వివరాలు తప్పనిసరి.


చాలా మంది భారతీయ బ్యాంకు అకౌంట్ హోల్డర్ల చేతిలో డెబిట్ కార్డు లేక దీన్ని రిజిస్ట్రర్ చేసుకోలేకపోతున్నారు. దీన్ని గమనించిన ఫోన్‌పే ఆధార్ అథెంటికేషన్‌తోనే యూపీఐను యాక్టివేట్ చేసుకునే విధానాన్ని తీసుకొచ్చింది..ఫోన్‌పే యాప్‌లో యూపీఐ ఆన్‌బోర్డింగ్ జర్నీలో ఆధార్ ఈ-కేవైసీ భాగం కానుంది. ఈ ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్‌ను కేవలం ఆధార్‌కు చెందిన చివరి ఆరు అంకెలను నమోదు చేయడం ద్వారా పూర్తి చేసుకోవచ్చు. యూఐడీఏఐ నుంచి ఓటీపీ వస్తుంది. అథెంటికేషన్ ప్రక్రియను సంబంధిత బ్యాంకు పూర్తి చేస్తుంది. ఆ తర్వాత ఫోన్‌పే యాప్‌పై యూపీఐ పేమెంట్లు, బ్యాలెన్స్ చెకింగ్ వంటి అన్ని యూపీఐ లావాదేవీలను చేసుకోవచ్చు.. ఇప్పుడు సులభతరం చేశారు..ఓటర్, పాన్ కార్డులకు కూడా ఆధార్ ను లింక్ చేసుకోవడం తప్పనిసరి..




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: