ఉత్తరాంధ్ర : మోడీ టూర్ పార్టీల్లో టెన్షన్ పెంచేస్తోందా ?

Vijaya





నరేంద్రమోడీ రాకవల్ల రాష్ట్రానికి జరగబోయే లాభం ఏమిటో తెలీదుకానీ రాజకీయపార్టీల్లో టెన్షన్ మాత్రం పెరిగిపోతోంది. మోడీ-పవన్ భేటీ ఉంటుందా ఉండదా అనేది ఒక టెన్షన్. భేటీ జరిగితే ఏమి మాట్లాడుకుంటారనేది మరో టెన్షన్. పవన్ బీజేపీని వదిలేసి తమతో చేతులు కలుపుతారా లేదా అన్న టెన్షన్ చంద్రబాబునాయుడులో పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో తమతో చంద్రబాబును కూడా కలుపుకోవాలన్న ఆశను నరేంద్రమోడీ ఆమోదిస్తారా లేదా అన్నది పవన్ టెన్షన్.



టీడీపీతో చేతులు కలుపుతాడా లేకపోతే బీజేపీతోనే పవన్ ఉండిపోతాడా అనేది వామపక్షాల్లో పెరిగిపోతున్న టెన్షన్.  మిత్రపక్షాలుగా బీజేపీ-జనసేన మాత్రమే ఉంటాయా లేకపోతే వీళ్ళతో టీడీపీ కూడా కలుస్తుందా అనేది వైసీపీలో పెరిగిపోతున్న  టెన్షన్. ఇలా అనేకపార్టీలు అనేకరకాల టెన్షన్లతో అవస్తలు పడుతున్నాయి. అయితే బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసే పోటీచేస్తాయని ఇప్పటికే వైసీపీ మెంటల్ గా ఫిక్సయిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డిలో అంత టెన్షన్ కనబడటంలేదు.



కాకపోతే ఎక్కువ టెన్షన్ చంద్రబాబు, పవన్లో మాత్రమే. బీజేపీలో కూడా అంత టెన్షన్ కనిపించటంలేదు. ఎందుకంటే వాళ్ళకి ఉన్నదేమీ లేదుకాబట్టి పోవటానికి ఏమీలేదు. తనను కూడా మిత్రపక్షంగా కలుపుకుంటే జగన్ కతేంటో చూడచ్చని చంద్రబాబు బాగా తహతహలాడుతున్నారు. చంద్రబాబు వీళ్ళతో మిత్రపక్షంగా కలిస్తే ఒకపద్దతి కలవలేకపోతే మరోపద్దతిగా ఉంటుంది రాష్ట్ర రాజకీయం. మిత్రపక్షంగా కలిస్తే బీజేపీ వల్ల చంద్రబాబుకు పెద్ద ఉపయోగమేమీ ప్రత్యేకించి ఉండదు.




కాకపోతే మోడీని అడ్డంపెట్టుకుని జగన్ను నియంత్రించాలన్నది చంద్రబాబు ప్లాన్. ఇంతకుమించి బీజేపీతో పొత్తువల్ల చంద్రబాబుకు ఉపయోగమేమీలేదు. ఇన్నిపార్టీల్లో ఇన్నిరకాలుగా మోడీ పర్యటన టెన్షన్ పెంచేస్తోంది కాబట్టే అందరి దృష్టి మోడీపైనే ఉంది. మరి చివరకు మోడీ పర్యటన వల్ల ఎవరికి హ్యాపీ ఎవరికి అన్ హ్యాపీ అన్నది అర్ధంకావటంలేదు. మోడీతో పవన్ భేటీ విషయాలు బయటకు వచ్చే అవకాశంలేదు. అయితే చంద్రబాబు, పవన్ బాడీ ల్యాంగ్వేజ్ తో పాటు ఎల్లోమీడియా రాతల వల్ల బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పొత్తుల విషయం అసలు మోడీ మాట్లాడుతారా అన్నది కూడా డౌటే. చివరకు ఏమవుతుందో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: