టీడీపీలో మరో భయం మొదలైందా... ఎమ్మెల్సీ ఎన్నికలే కారణమా?

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సి ఎన్నికలు జరగడానికి ఇంకా కొద్ది కాలం మాత్రమే ఉంది. ఇవి కాకుండా రాయలసీమ ప్రాంతంలో టీచర్స్ ఎలక్షన్స్ మరియు గ్రాడ్యుయేట్ ఎన్నికలు కూడా జరపడానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఎప్పటిలాగే రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా పోటా పోటీ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అదే విధంగా ఈ ఎన్నికలను కూడా అధికార ప్రతిపక్ష పార్టీలు చాలా ప్రెస్టేజ్ గా తీసుకుంటున్నాయి. ఇక్కడ పార్టీ డైరెక్ట్ గా పోటీ చేయకపోయినా రాజకీయ పార్టీలు బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని సర్వ ప్రయత్నాలు చేస్తారు. తమ పాలన బాగుంది అని మరోసారి నిరూపించుకోవాలంటే ఈ ఎన్నికలో వైసీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి.
ప్రతిపక్ష టీడీపీ కూడా ఈ ఎన్నికలో తమ సత్తా చాటాలని ప్రణాళికలు రచిస్తోంది. చంద్రబాబు నాయుడుకు ఈ ఎన్నిక వైసీపీని తిప్పి కొట్టడానికి ఒక మంచి అవకాశమని చెప్పవచ్చు. ఈ ఎన్నికలో టీడీపీ గెలవడం ద్వారా వైసీపీ పాలన బాగోలేదని ప్రజలకు చెప్పి మెయిన్ ఎన్నికలకు ఒక మార్గంగా చేసుకోవచ్చు. అందులో భాగంగా టీడీపీ టీచర్లు మరియు గ్రాడ్యుయేట్ లను లాలించే పనిలో పడింది. గత కొద్ది రోజుల నుండి ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హులుగా ఉన్నవారు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని రాజకీయ నాయకుల నుండి ప్రభుత్వ అధికారుల వరకు అందరూ తెలియచేస్తున్నారు.
మాములుగా ఈ ఎన్నికలో పాల్గొనడానికి ఉండాల్సిన అర్హతలను ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అర్హత లేకుండా చాలా మంది తమ ఓటును నమోదు చేసుకుంటున్నారని టీడీపీ భావిస్తోంది. ముఖ్యంగా వైసీపీ ఈ విషయంలో చురుకుగా వ్యవహరిస్తోందని విమర్శలు చేస్తోంది, ఇక రాష్ట్ర ఎన్నికల సంఘంపైన కూడా టీడీపీ విరుచుకుపడుతోంది. నకిలీగా నమోదు అవుతున్న ఈ ఓటర్ల వలన మాకు నష్టం జరిగియే అవకాశం ఉందని లబోదిబోమంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: