అమరావతి : వైసీపీ-టీడీపీలకు కష్టమేనా ?

Vijaya


వచ్చేఎన్నికల్లో అధికారం నిలుపుకోవాలని జగన్మోహన్ రెడ్డి, ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే అభ్యర్ధుల ఎంపిక విషయాల్లో ఇద్దరు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కచ్చితంగా గెలుస్తారన్న నమ్మకం ఉన్న వాళ్ళకే చంద్రబాబు టికెట్ కేటాయించాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. మొహమాటాలకు, ఒత్తిళ్ళకి లొంగితే పార్టీకి ఇక భవిష్యత్తుండదనే భయం చంద్రబాబులో పెరిగిపోతోంది. ఇదే సమయంలో జగన్ కూడా సర్వేల మీద సర్వేలు చేయించుకుంటున్నారు.



ఈ విషయాలను పక్కనపెట్టేస్తే రెండు పార్టీల్లోను కామన్ పాయింట్ ఒకటి కనిపిస్తోంది. అదేమిటంటే అసమ్మతి. రెండుపార్టీల్లోను కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి బాగా పెరిగిపోతోంది. ముందుగా వైసీపీ విషయాన్ని తీసుకుంటే నెల్లూరు, పలాస, హిందుపురం, గిద్దలూరు, గన్నవరం లాంటి 20 నియోజకవర్గాల్లో పార్టీలోనే విభేదాలు తీవ్రంగా ఉన్నాయి.  విచిత్రం ఏమిటంటే పై నియోజకవర్గాల్లోని మంత్రులు లేదా ఎంఎల్ఏలు ఓడిపోవాలని టీడీపీకన్నా సొంతపార్టీ వైసీపీలోనే ఎక్కువమంది కోరుకుంటున్నారు.



ఇక టీడీపీ విషయం చూస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అసమ్మతి తక్కువేమీలేదు. తిరుపతి, నంద్యాల, ఆళ్ళగడ్డ, రాయదుర్గం, డోన్, అనంతపురం, పుట్టపర్తి, విజయవాడ సెంట్రల్, నెల్లిమర్ల, విజయనగరం, విశాఖపట్నం ఉత్తరం, పెద్దాపురం, కొవ్వూరు, పాయకరావుపేట లాంటి మరో 20 నియోజకవర్గాల్లో టికెట్ కోసం తమ్ముళ్ళ మధ్య విభేదాలు తీవ్రస్ధాయిలో ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో గొడవలు సర్దుబాటు చేయాలని చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యంకావటంలేదు.




చూస్తుంటే పార్టీలోని సొంతనేతల అసమ్మతి కారణంగానే రెండుపార్టీలు కూడా కొన్ని నియోజకవర్గాలను కోల్పోవాల్సొచ్చేట్లుంది. ఈ కారణంగానే పై నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. పోనీ రెండుపార్టీల్లోని నేతల విభేదాల వల్ల జనసేన కానీ మరోపార్టీ కానీ లబ్దిపొందుతుందా ? అనుకుంటే వాటికి అంత సీన్ కనిపించటంలేదు. వైసీపీ ఓకేనే కానీ టీడీపీకే ఎక్కువ ఇబ్బంది. ఎందుకంటే అది పొత్తులకోసం ఆరాటపడుతోంది కాబట్టే. ఇందుకనే పై నియోజకవర్గాల్లోని నేతల్లో అయోమయం పెరిగిపోతోంది. మరీ నియోజకవర్గాల్లో గొడవలను అధినేతలు ఎలా పరిష్కరిస్తారో తెలీటంలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: