అమరావతి : విజయసాయికి డబుల్ షాక్..ఏమయ్యుంటుది ?
రాజ్యసభలో వైసీపీకి నరేంద్రమోడీ సర్కార్ పెద్ద షాకిచ్చింది. రాజ్యసభ ప్యానల్ వైస్ ఛైర్మన్ల జాబితానుండి విజయసాయిరెడ్డి పేరును తీసేసింది. రెండురోజు క్రితమే రాజ్యసభకు ప్యానల్ వైస్ ఛైర్మన్లంటు రాజ్యసభ ఛైర్మన్ 8 మంది పేర్లను ప్రకటించారు. ఆ జాబితాలో విజయసాయికి రెండోసారి అవకాశం దక్కింది. దాంతో వైసీపీలో అందరు ఎంపీకి అభినందనలు తెలిపారు. గతంలో ఛైర్మన్ గా వెంకయ్యనాయుడు ఉన్నపుడు కూడా విజయసాయికి ప్యానల్ ఛైర్మన్ల జాబితాలో అవకాశం దక్కింది.
అప్పట్లో రెండుమూడుసార్లు ప్యానల్ వైస్ ఛైర్మన్ హోదాలో ఈ ఎంపీ ఛైర్మన్ కుర్చీలో కూర్చున్నారు కూడా. కాబట్టి ఛైర్మన్ జగదీప్ ధనకర్ కూడా ప్యానల్ వైస్ ఛైర్మన్ల జాబితాలో విజయసాయిని కంటిన్యు చేయటంలో ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. అయితే రెండురోజులు తిరిగేసరికి జాబితాలో నుండి ఎంపీ పేరు లేచిపోయింది. శీతాకాల సమావేశాల సందర్భంగా 7వ తేదీన పార్లమెంటు సమావేశాలు మొదలయ్యాయి. మొదటిరోజే ఛైర్మన్ ధనకర్ ప్యానల్ వైస్ ఛైర్మన్ల జాబితాను ప్రకటించారు. కొత్త జాబితాలో విజయసాయి పేరు మాయమైపోయింది.
అంటే రెండురోజుల్లోనే తెరవెనుక ఏమైపోయిందో ఏమో ఎవరికీ అర్ధంకావటంలేదు. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం పార్టీయే విజయసాయి పేరును తీయించేసిందట. విజయసాయిపై వస్తున్న ఆరోపణలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అల్లుడి అన్న శరత్ చంద్రారెడ్డి ఇరుక్కోవటం లాంటి అనేక కారణాలతో విజయసాయిని జగన్ దూరంపెడుతున్నట్లు టాక్. ఈ నేపధ్యంలోనే రెండురోజుల్లోనే జాబితాలో మార్పులు జరగాయట.
ప్యానల్ వైస్ ఛైర్మన్ల జాబితాలో నుండి ఎంపీ పేరు మాయమైపోవటం వెనుక ఇంకా ఏమైనా కారణాలు కూడా ఉన్నాయేమో తెలీటంలేదు. సరే కారణాలు ఏవైనా విజయసాయికి అటు ధనకర్ ఇటు పార్టీ ఒకేసారి షాక్ ఇచ్చినట్లయ్యింది. లోక్ సభ ప్యానల్ స్పీకర్ల జాబితాలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మిథున్ కొన్నిసార్లు స్పీకర్ కుర్చీలో కూర్చున్నారు కూడా. ఏదేమైనా రాజ్యసభకు సంబంధించి విజయసాయి పేరు లేకపోవటమే ఫాకింగ్ గా ఉంది.