వర్షాలు ఇప్పటిలో తగ్గవు..బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..

Satvika
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మొన్నటివరకు కురిసిన భారీ వర్షాలకు జనం అల్లాడిపోతున్నారు. ఇక ఇప్పుడు మరో తుఫాన్ హెచ్చరిక వచ్చింది. ఈనెల 15న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.ఇప్పటికే మాండూస్ తుఫాన్ ప్రభావంతో నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇటు తెలంగాణ, అటు ఏపీల్లో మాండూస్‌ తుఫాను రైతన్నలను కంటతడి పెట్టిస్తోంది. ధాన్యం కొనుగోళ్ళు లేక గత 20 రోజులుగా రోడ్లపైనే ధాన్యం పోసుకుని రైతన్నలు వాటి అమ్మకం కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రభుత్వం కొనుగోలు చేయదు, మిల్లర్లు తీసుకోరు. ఏం చేయాలతో తోచక.. రవాణా ఖర్చులు భరించలేక ధాన్యం రోడ్లపైనే కుప్పలు పోసి, ఇప్పుడు మాండూస్‌ తుఫానుతో రైతన్నలు కుప్పయ్యారు. కుండపోత వర్షాల వల్ల తీరని నష్టం వాటిల్లింది. రోడ్ల పై, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయిపోతుంటే తల్లడిల్లి పోతున్నారు.. రెక్కల కష్టాన్ని కాపాడుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు..వరంగల్ జిల్లాలో రహదారులపై ఆరబోసిన ధాన్యాన్ని అకాల వర్షాల నుండి కాపాడుకోడవం కోసం రాత్రి సమయంలో అన్నదాతలు పడుతున్న అష్టకష్టాలు చెప్పలెము...మంచిర్యాల {{RelevantDataTitle}}