ఏపీ ఓటర్లను కన్ఫ్యూజ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ?

VAMSI
సినిమాలలో ఒక రేంజ్ స్టార్ డం ను ఎంజాయ్ చేస్తున్న పవన్ కళ్యాణ్... అలా అక్కడే ఉండిపోకుండా ఎవరి ప్రమేయం వలనో తెలియదు కానీ రాజకీయ బాట పట్టారు. ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రజలకు కనెక్ట్ అయ్యేలా జనసేన అన్న పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి తానే అధ్యక్షుడిగా ఉన్నాడు. అయితే గత ఎన్నికల్లో కంటెస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ మరియు తన పార్టీ ఎమ్మెల్యే ఎంపీలలో కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలుపొందడం విశేషం. ఈ రిజల్ట్ తో రాజకీయ విశ్లేషకులు పవన్ కు రాజకీయాలు అబ్బవని తేల్చేశారు. అయినప్పటికీ తానేమిటో నిరూపిస్తానని విడతల వారీగా ప్రజల ముందుకు వస్తూ నాలుగు సినిమా డైలాగులు చెప్పి వెళుతూ వచ్చాడు.
అయితే ఇక ఏపీలో 2024 లో ఎన్నికలు  రానున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో గెలుపు కోసం ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీ మరియు జనసేన పార్టీ రాజకీయ వ్యూహాలను మరియు ప్రణాలికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తోంది, ఇక టీడీపీ కూడా ఒంటరిగానే పోటీ చేస్తుంది. అయితే జనసేన మాత్రం ఏ విధంగా ఎన్నికల్లో పోటీ చేస్తుంది అన్నది ఇప్పటికే ఒక క్లారిటీ లేదు. ఆ మధ్య ఒక మీటింగ్ లో ఈసారి ఎన్నికల్లో ఒంటరిగానే జనసేన పోటీ చేస్తుంది అని, ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని జనసేనాని పవన్ కళ్యాణ్ ఖరాఖండీగా చెప్పాడు. పవన్ కు ఉన్న అవగాహన కమిట్మెంట్ చూసిన కొందరు పవన్ కు మద్దతుగా ఉన్నారు.
కట్ చేస్తే... ఇటీవల వేరొక మీటింగ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలడానికి మేము ఎటువంటి పరిస్థితుల్లో సహకరించబోమని... అవసరం అయితే య్వప్ వ్యతిరేక పార్టీలను ఏకంచేసి పోరాడుతామని శపథం చేశాడు. ఒకే వ్యక్తి ... ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇలా ఒక్కో మీటింగ్ లో ఒక్కో రకంగా మాటలు చెప్పుకుంటూ పోతే పార్టీతో ఏకమై , పార్టీ అభివృద్ధికి కృషి చేసే వారు పవన్ ను ఎలా అర్ధం చేసుకోవాలి. ఇక పవన్ మీటింగ్ లకు వస్తూ ఆయన చెప్పే మాటలను వింటున్న ఏపీ ఓటర్లు కూడా డబుల్ స్టాండర్డ్ వ్యక్తిత్త్వం ఉన్న మనిషిని ఏ విధంగా అర్ధం చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. మరి ఎప్పటికి ఎన్నికలపై పోటీ చేసే విషయంలో ఒక క్లారిటీ కి వస్తాడు అన్నది చూడాలి.    
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: