ప్రయాణికులకు అలర్ట్..వీటిని తీసుకెళ్తే అంతే సంగతులు..జాగ్రత్త..

Satvika
సుఖ వంతమైన ప్రయాణాలకు రైలు మార్గాలు చాలా బెస్ట్..విశాల వంతంగా ఉండటంతో పాటు అన్నీ సౌకర్యాలు కూడా ఉన్నాయి.దాంతో రోజుకు ఎన్నో లక్షల మంది రైల్లో ప్రయాణాలు చేస్తున్నారు..అయితే, బస్సుల లో వెళ్ళడం కన్నా రైల్లో వెళ్ళేటప్పుడు మన తో పాటు లగెజిని కూడా తీసుకొని వెళ్తారు..కొన్ని సార్లు అనేకమంది భారీగా లగెజ్ ను తీసుకొని వెళ్తారు.. అలాంటి సమయంలో అక్కడ వున్న సిబ్బంది వాటిని చూస్తె భారీగా  ఫైన్ వేసే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి..


అయితే రైల్లో వెళ్ళేటప్పుడు ఈ మూడు వస్తువులను అస్సలు తీసుకెళ్ల కూడదట..వీటి గురించి టీటీఈకి తెలిస్తే నేరుగా జైలుశిక్ష, ప్రత్యేకంగా భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ వస్తువులు ఏంటో చూడండి..


టపాసులు..


టపాసులను రైల్లో తీసుకెళ్లడం పూర్తిగా నిషేధం. పటాకులు పేలడం వల్ల రైలులో మంటలు చెలరేగి ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఎవరైనా రైలులో పటాకులు తీసుకెళ్తుంటే దొరికితే వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. అతనికి భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించవచ్చు..అందుకే ఎప్పుడూ చెయ్యకండి జాగ్రత్త..


గ్యాస్ సిలిండర్..


దూర ప్రాంతాల్లో పని చేసే వారు ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తమతో పాటు స్టవ్‌లు, సిలిండర్లు తీసుకువస్తుంటారు. రైలులో గ్యాస్ సిలిండర్లు, స్టవ్‌లను తీసుకెళ్లడం నెరమని అధికారులు తెలుపుతున్నారు.. ఒక వేళ తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు రైల్వే నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే ఖాళీ సిలిండర్లను తీసుకెళ్లవచ్చు. నింపిన సిలిండర్ దొరికితే జైలు శిక్ష కఠినమైన శిక్షలు, జైలు కు వెళ్ళే అవకాశం కూడా ఉంది...


ఆయుధాలు..


మీరు రైలులో లైసెన్స్ పొందిన ఆయుధాలు తప్ప కత్తి, ఈటె, బాకు, రైఫిల్ లేదా మరే ఇతర ప్రాణాంతక ఆయుధాలను తీసుకెల్లకూడదు..అది నేరం అవుతుంది.  ఇలా చేయడం వల్ల రైల్వే చట్టం, ఆయుధ చట్టం కింద మీపై కేసు నమోదు చేస్తారు.శిక్షలు కూడా వుంటాయి..


యాసిడ్‌ బాటిళ్లు..


రైలులో యాసిడ్ బాటిల్ తీసుకెళ్లడం పూర్తిగా నిషేధం..మరియు చట్ట విరుద్ధం.. ఒక ప్రయాణికుడు ఇలా చేస్తూ పట్టుబడితే రైల్వే చట్టంలోని సెక్షన్ 164 కింద అతన్ని వెంటనే అరెస్టు చేయవచ్చు.. అంతేకాదు వెయ్యి రూపాయలు జరిమానా లేదా 3 ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చు..అందుకే ఎప్పుడూ ఈ తప్పులు చెయ్యరాదు..గుర్తుంచుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: