దేశంలో రైతుల ప్రాధాన్యత ఎంత వుందో అందరికి తెలుసు..మన నోటికి నాలుగు వేళ్ళు పోవాలంటే వాళ్ళ కష్టపడక తప్పదు..అయితే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అందిస్తూ వస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా రైతులకు ఆదాయాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చిన పథకమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి.. ఈ పథకం కింద సొంత భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6,000 చొప్పున అందిస్తోంది. ఈ ఆరు వేల మొత్తాన్ని మూడు విడు తలుగా రూ.2,000 చొప్పున జమ చేస్తూ వస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇప్పటివరకు 12వ విడతల్లో నగదు జమచేయగా..ఇక త్వరలో 13వ విడత నగదు విడుదల చేయనుంది..
ఈ విషయం పై మాత్రం ఒక క్లారిటీ రాలేదు..రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత నగదు ఎప్పుడు విడుదల అవుతాయోనన్న అధికారిక సమాచారం కోసం.. ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, మోడీ ప్రభుత్వం 13వ విడత నగదును డిసెంబర్ నెలలోనే విడుదల చేస్తుందని ఊహాగానాలు వ్యాపించాయి.. 2023 నూతన సంవత్సరం సందర్భంగా లబ్ధిదారుల ఖాతాకు 13వ వాయిదాను జమ చేయొచ్చంటూ చెబుతున్నప్పటికీ.. ఫిబ్రవరి-మార్చి మధ్య విడుదల చేసే అవకాశం ఉందని కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
బ్యాలెన్స్ ను ఎలా చెక్ చేసుకోవాలంటే..
ముందుగా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి - https://pmkisan.gov.in/
హోమ్‌పేజీలో ఫార్మర్స్ కార్నర్ సెక్షన్‌పై క్లిక్ చేయండి..
‘బెనిఫిషియరీ స్టేటస్’ పై క్లిక్ చేయండి.. ఇక్కడ, లబ్ధిదారుల దరఖాస్తు స్థితిని తనిఖీ చేయవచ్చు.
జాబితాలో రైతు పేరు, అతని బ్యాంకు ఖాతాకు జమ చేసిన మొత్తం వివరాలు ఉంటాయి.
ఇప్పుడు మీ ఆధార్ నంబర్ లేదా ఖాతా నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
ఆపై ‘డేటా పొందండి’పై క్లిక్ చేయండి.
ఈ పథకం కింద అర్హులు తప్పనిసరిగా విదులను మోదీ ప్రభుత్వం కోరుకుంటుంది..