నరేంద్ర మోదీ: తల్లి చనిపోయిన బాధలో కూడా ..?

Purushottham Vinay
నరేంద్ర మోదీ : తల్లి చనిపోయిన బాధలో కూడా ..?
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మృతి... ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ (100) గత కొద్ది రోజులుగా ఆరోగ్యం విషమించడంతో అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చేరి తీవ్ర చికిత్స పొందుతూ మరణించారు. ఆమె గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఆమె తుదిశ్వాస విడిచారు.  ఆరోగ్యం బాగా విషమించడంతో మరణించారు. ఆమె మృతి పట్ల రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. . 'వందేళ్ల అద్భుతం భగవంతుని పాదాల వద్ద విశ్రాంతి తీసుకుంటోందని' ఆయన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. అంతేగాక ఆమె నిస్వార్థ కర్మయోగి అని, ఆమె జీవితం విలువలతో కూడుకున్నదని ఆయన పేర్కొన్నారు. వందో పుట్టిన రోజు నాడు తాను తన తల్లిని కలిశానని ఆయన గుర్తు చేసుకున్నారు.


ఆమె ఎప్పుడూ తనతో ఓ విషయాన్ని చెప్పేవారని ఇంకా విజ్ఞతతో పనిచేయాలని, అలాగే జీవితాన్ని స్వచ్చంగా గడపాలని చెప్పేవారని ఆయన పేర్కొన్నారు.. అంతేగాక జీవితాన్ని స్వచ్ఛంగా గడపాలని తన తల్లి సలహా ఇచ్చిందని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధాని మోదీ గుజరాత్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లారు. అప్పడు ప్రధాని మోదీ తన తల్లి హీరాబెన్ మోదీని కలుసుకుని ఆశీస్సులు పొందారు.ఇప్పుడు ఆమె మరణం పట్ల చాలా బాధాకరంగా ఉన్నారు.అయితే తన తల్లి మరణించిన బాధలో ఉన్నా.. తన బాధ్యతలను మాత్రం ప్రధాని మరవలేదు. ఈ రోజు షెడ్యూల్‌ ప్రకారం పశ్చిమబెంగాల్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ఇంకా ప్రారంభోత్సవాలకు హాజరు కావాల్సిన మోడీ.. ఆయన తల్లి మరణించడంతో హుటాహుటిన అహ్మదాబాద్‌కు వెళ్లి తల్లి పాడేమోసి అంతిమ యాత్రలో మోదీ పాల్గొన్నారు. ఇంత బాధలో ఉన్నా కానీ బాధ్యతలను నిర్వర్తిస్తూ షెడ్యూల్‌ ప్రకారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కార్యక్రమాలలో పాల్గొనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: