న్యూయర్ వస్తుంది అంటే హంగామా మామూలుగా ఉండదు.. మరి కొద్ది గంటల్లో కొత్త సంవత్సరం లోకి అడుగు పెట్ట బోతున్నామని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మహా నగరాల్లో అయితే వేడుకలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. నిషాలను ఎక్కుస్తూ యువత మత్తులో మునిగి తెలుతారు.. హైదరాబాద్ లో న్యూయర్ వేడుకలు ఎలా ఉంటాయో అందరికి తెలుసు.. వేడుకలు జరుపుకున్నా కూడా కొన్ని రూల్స్ మాత్రం తప్పని సరి అంటున్నారు అధికారులు.. గొడవలు జరగకుండా పోలీసులు కూడా ముందస్తు చర్యలను తీసుకుంటున్నారు..
ఈరోజు అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, నిబంధనలు విధించారు. భద్రతా చర్యల్లో భాగంగా నగర వ్యాప్తంగా ఉన్న అన్ని ఫ్లై ఓవర్లను మూసివేయనున్నారు. బేగంపేట్, లంగర్ హౌజ్ ఫ్లై ఓవర్లు మాత్రం తెరిచి ఉంటాయన్నారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్ వైపు వాహనాలను అనుమతించమన్నారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. నగర వాసులు నిబంధనలను తప్పక పాటించాలని, లేకుంటే మాత్రం కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
వీవీ స్టాచ్యూ, ఎన్టీఆర్ మార్గ్, రాజ్ భవన్ రోడ్, బీఆర్కే భవన్, తెలుగు తల్లి జంక్షన్, ఇక్బాల్ మినార్, లక్డీకాపూల్, లిబర్టీ జంక్షన్, అప్పర్ ట్యాంక్ బండ్, అంబేడ్కర్ స్టాచ్యూ, రవీంద్ర భారతి, ఖైరతాబాద్ మార్కెట్, నెక్లెస్ రోటరీ, సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ లేన్, నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి, సంజీవయ్య పార్క్, పీవీఎన్ఆర్ మార్గ్, మినిస్టర్ రోడ్, సైలింగ్ క్లబ్, కవాడిగూడ ఎక్స్ రోడ్, లోయర్ ల్యాంక్ బండ్, కట్టమైసమ్మ టెంపుల్, అశోక్ నగర్, ఆర్టీసీ ఎక్స్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కఠినంగా అమలు చేయనున్నారు. ఇక బస్సులు, ట్రక్కులతో పాటు ఇతర వాహనాలను రాత్రి 2 గంటల వరకు హైదరాబాద్‌లోకి అనుమతించరు. అలా చేసేవారికి మెట్రో సేవలను వినియోగించు కోవాలని విజ్ఞప్తి చేశారు..