గోదావరి : పవన్ ప్లాన్ అట్టర్ ఫెయిలైందా ?
డిసెంబర్ 31వ తేదీలోగా కాపులకు 5 శాతం రిజర్వేషన్ అమలుచేయకపోతే జనవరి 2వ తేదీనుండి దీక్ష చేయబోతున్నట్లు జగన్ కు రాసిన లేఖలో హెచ్చరించారు. అయితే ఆ లేఖను, జోగయ్య వార్నింగును జగన్ ఏమాత్రం లెక్కచేయలేదు. అందుకనే జోగయ్య సోమవారం దీక్షకు రెడీ అవుతుంటే పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుప్రతిలో జాయిన్ చేశారు. నిజానికి 86 ఏళ్ళ వయసులో జోగయ్య చేసే దీక్ష ఏముంటుంది ? పైగా కాపుల సంక్షేమం గతంలో జోగయ్య చేసిన ఆందోళనలు కూడా ఏమీలేవు.
ఇలాంటి పరిస్ధితుల్లో సడెన్ గా జగన్ కు జోగయ్య లేఖ రాయటం దీక్షకు కూర్చుంటానని బెదిరించటమే ఆశ్చర్యంగా ఉంది. అసలు జోగయ్య లేఖ వెనకాల ఎవరున్నారని ఆరాతీస్తే పవన్ ఉన్నట్లు తేలింది. ఎందుకంటే పవన్ కు మద్దతుగా జోగయ్య కాపులందరినీ ఏకం చేయాలని చాలా ప్రయత్నాలే చేశారు. అయితే చాలామంది జోగయ్య ప్రయత్నాలను ఏమాత్రం పట్టించుకోలేదు. సమావేశాలతో లాభంలేదని అనుకున్న చేగొండి కాపులంతా జనసేనకు మద్దతుగా నిలబడాలని బహిరంగంగా పిలుపులిస్తున్నారు. అయినా కాపులు పెద్దగా స్పందించలేదు.
తనకు కాపులంతా మద్దతుగా నిలబడాలని అడిగేంత ధైర్యంలేని పవన్ తనకు మద్దతుగా నిలబడే జోగయ్యను ఇపుడు దీక్షపేరుతో రంగంలోకి దింపారని టాక్ వినబడుతోంది. అయితే ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం జోగయ్య వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన్ను ఆసుపత్రిలో చేర్చింది. అందుకనే జోగయ్యతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని పవన్ ట్విట్టర్ వేదికగా మొత్తుకుంటున్నారు.