ఢిల్లీ : చంద్రబాబు మళ్ళీ వేసేశాడా ?

Vijaya






ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు మళ్ళీ యూ టర్న్ తీసుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాలన్నా, నడుచుకోవాలన్నా ఏమాత్రం ధైర్యం చేయటంలేదు. అన్నీ జాతీయ, ప్రాంతీయపార్టీలతో  కేంద్ర ఎన్నికల కమీషన్ ఒక మీటింగ్ పెట్టింది. రిమోట్ పద్దతిలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటింగ్ వేసే సదుపాయం కల్పించే ఉద్దేశ్యంతో అభిప్రాయాలను చెప్పమని చెప్పింది. చాలాపార్టీలు రిమోట్ పద్దతిలో ఓటింగ్ ను తీవ్రంగా వ్యతిరేకించాయి.



అయితే ఆశ్చర్యకరంగా తెలుగుదేశంపార్టీ మాత్రం రిమోట్ పద్దతిలో ఈవీఎంలను ఉపయోగించటాన్ని స్వాగతించింది. ఆశ్చర్యకరమని ఎందుకు అంటున్నామంటే మొన్నటివరకు అసలు ఈవీఎంలే వద్దని నానా గోల చేశారు చంద్రబాబు. ఈవీఎంల స్ధానంలో మళ్ళీ బ్యాలెట్ పద్దతిలోనే పోలింగ్ జరపాలని పదేపదే డిమాండ్లు చేశారు. పోలింగ్ లో అసలు ఈవీఎంలనే వద్దని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు ఇఫుడు రిమోట్ పద్దతిలో ఓటింగ్ ను ఆమోదిస్తారని ఎవరైనా అనుకుంటారా ?




అయినా ఎందుకని టీడీపీ రిమోట్ పద్దతిలో ఓటింగ్ కు మద్దతిచ్చింది ? ఎందుకంటే దీనికి బీజేపీ మద్దతుగా ఉందికాబట్టే. ఈవీఎంలే కాదు ఇపుడు కమీషన్ ప్రతిపాదిస్తున్న రిమోట్ పద్దతిలో ఓటింగ్ కు కూడా నరేంద్రమోడీ సానుకూలంగా ఉన్నారు. ఎప్పుడైతే మోడీ సానుకూలంగా ఉన్నారని తెలిసిందో వెంటనే చంద్రబాబు కూడా తన స్టాండ్ మార్చేసుకున్నారు. బ్యాలెట్ పద్దతిలోనే ఓటింగ్ అని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు ఒక్కసారిగా ఈవీఎంలు అందులోను రిమోట్ ఈవీఎంలకు కూడా ఓకే చెప్పేశారు.



దీంతోనే మోడీ అంటేనే చంద్రబాబు ఎంతగా భయపడుతున్నారో అర్ధమైపోతోంది. ఏ విషయంలో కూడా తనకంటు చంద్రబాబుకు ఒక కచ్చితమైన స్టాండ్ అంటు ఉండదని తాజాగా అర్ధమైపోయింది.  ఏ విషయంలో అయినా లాభమో నష్టమో ఒక విధానమంటు ఉండాలి ప్రతిఒక్కళ్ళకు. కానీ చంద్రబాబుకు మాత్రం అలాంటివేమీ ఉండవు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అవునంటే తాను కాదనాలి. జాతీయస్ధాయిలో మోడీ దేనికి తలూపితే తాను దానికే తలూపాలి అనేదే చంద్రబాబు సిద్ధాంతంగా ఫిక్సయిపోయారు. ఇంతోటిదానికి తనకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని గప్పాలు చెప్పుకోవటం ఎందుకో ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: