రాయలసీమ : టీడీపీకి ఇంకా బుద్ధిరాలేదా ? ఇందుకే జీవో 1 తెచ్చింది
దేవాలయం నుండి మసీదు వరకున్న రోడ్డు చాలా ఇరుగ్గా ఉంటుంది. ఇంత ఇరుకైన రోడ్డులో అంతమంది జనాలతో లోకేష్ పాదయాత్రను మొదలుపెట్టడమే తప్పు. సెంటిమెంటు ప్రకారం ఆ రోడ్డలో పాదయాత్రను మొదలుపెట్టినా జనాలను అంతమందిని పోగేసుండకూడదు. పాదయాత్ర మొదలుపెట్టేటపుడు ఇరుకురోడ్డులో వెళ్ళకూడదన్న కనీస ఇంగితం కూడా లేకుండా మొదలుపెట్టేశారు. దాంతో ఇపుడు తారకరత్న ప్రాణాలమీదకు వచ్చేసింది.
రోడ్డుమీద పడిపోయిన తారకరత్నను కారులో ఆసుపత్రికి చేర్చేసమయానికి కార్డియాక్ అరెస్టయి, పల్స్ ఆగిపోయింది. డాక్టర్లు నానా అవస్తలు పడిన 45 నిముషాల తర్వాత మళ్ళీ పల్స్ మొదలైంది. ఈలోగానే శరీరమంతా బ్లూ కలర్లోకి మారిపోయి మరణం అంచుల్లోకి జారిపోయారు. అత్యవసర చికిత్స నిమ్మితం తారకరత్నను కుప్పం నుండి బెంగుళూరుకి మార్చినా ఇంకా ప్రమాదం అంచునే ఉన్నట్లు సమాచారం. ఇక్కడ ప్రాణాపాయ స్ధితిలో ఉన్నది తారకరత్నా లేకపోతే మరొకళ్ళా అన్నది కాదు ప్రశ్న. ఇరుకురోడ్లలో ర్యాలీలు, రోడ్డుషోలు ఎందుకన్నదే పాయింట్. ఇలాంటివి జరక్కుండానే కదా ప్రభుత్వం జీవో 1 జారీచేసింది.