సరికొత్త టెక్నాలజీ.. రైళ్లను ఎలా క్లీన్ చేస్తున్నారో చూడండి?

praveen
ఇటీవల కాలంలో టెక్నాలజీకి అనుగుణంగానే అన్ని విషయాల్లో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే . నేటి రోజుల్లో ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తు ప్రతి పనిని కూడా సులభతరం చేసేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకొని అన్ని పనులను కూడా ఎంత సులభంగా చేసేస్తూ ఉన్నారు. ఒకప్పుడు చెమటోడ్చి కష్టపడి చేసిన పనులను సైతం ఇక ఇప్పుడు ఒక చోట కూర్చొని చెమట చుక్క కూడా చిందించకుండానే పూర్తి చేసేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా టెక్నాలజీ ప్రస్తుతం అన్ని రంగాల్లో కూడా అందుబాటులోకి వచ్చింది.

 ఈ క్రమంలోనే రైల్వే శాఖలో కూడా ఇలాంటి టెక్నాలజీని బాగా ఉపయోగిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఈ టెక్నాలజీకి అనుగుణంగానే ఎన్నో రకాల సదుపాయాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. ఇక ఇటీవలే రైల్వే మంత్రిత్వ శాఖ ఒక వీడియోని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయగా.. ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. గత కొన్ని ఏళ్లుగా రైలు క్లీనింగ్ ఎలా చేసేవారు..  ప్రస్తుతం టెక్నాలజీ ద్వారా ఇప్పుడు ఎలా చేస్తున్నారు అన్నది ఈ వీడియోలో చూడవచ్చు. గత కొన్ని ఏళ్ల నుంచి కూడా సిబ్బంది రైలు బోగీలను చేతులతో క్లీన్ చేయడం లేదా చేతి స్ప్రే పంపుతో శుభ్రం చేయడం లాంటివి చేస్తూ వస్తున్నారు.

 ఇటీవలే రైల్వే మంత్రిత్వ శాఖ సరికొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని ఆధునిక క్లీనింగ్ వ్యవస్థను రైల్వేలో ప్రవేశపెట్టింది అన్నది తెలుస్తుంది. నీటిని వెద  జల్లే షవర్ కింద మెల్లగా రైలు ముందుకు కదులుతూ ఉంటుంది.  ఇక రైలు పట్టాలకు ఇరుపక్కల ఉన్న బ్రష్ ల ద్వారా ట్రైన్ కంపార్ట్మెంట్లు ఆటోమేటిక్గా క్లీన్ అవుతున్నాయి అని చెప్పాలి. ఈ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేసిన భారత రైల్వే శాఖ హ్యాండ్ ప్రెస్ నుంచి సిస్టమాటిక్ స్విచ్ వరకు అంటూ ఒక శీర్షిక పెట్టింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: