బెంగళూరు : తమ రెండు కుటుంబాల్లో తమ ప్రేమకు అంగీకారం తెలుపలేదని ఓ ప్రేమ జంట ఏకంగా కొండ మీద నుంచి కిందికి దూకి ఆత్మహత్యయత్నం చేశారు. ఈ షాకింగ్ ఘటన బెంగళూరు సిటీలో చోటుచేసుకుంది.ఇక పూర్తి వివరాల్లోకెళ్తే.. రామనగర జిల్లాలోని రామదేవర బెట్టకు చెందిన డాక్టర్ విష్ణువర్ధన్ రోడ్డులోని ఓ ప్రైవేట్ కాలేజీలో చేతన్ (19) బీఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.ఇంకా అదే కాలేజీలో బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతుంది సాహిత్య (19). ఇక వీరు ఇద్దరు కూడా గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరువురి ఇళ్లల్లో పెద్దలు అంగీకరించకపోవడంతో శనివారం నాడు ఉదయం 11 గంటల ప్రాంతంలో సమీపంలోని కొండ మీద నుంచి కిందికి దూకారు. అయితే కొండ కింద ఉన్న చెట్లలో చిక్కుకుని కాపాడండంటూ ఆర్తనాదాలు చేశారు. అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఇక ఆ సంఘటన స్థలానికి చేరుకున్న రామనగర రూరల్ పోలీసులు జి వై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడ పొదల్లో గంటపాటు గాలించి.. అనంతరం రెండు గంటలపాటు శ్రమించి ఇద్దరినీ కాపాడారు. గాయాలపాలైన చేతన్ ఇంకా సాహిత్యలను రాజరాజేశ్వరి ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని, కేసుని నమోదు చేశారు. వారిద్దరూ గత 6 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారని, వారి పెళ్లికి పెద్దలు అంగీకారం తెలుపలేదని అందుకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వారు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. ఏకంగా 250 అడుగుల ఎత్తు నుంచి దూకినప్పటికీ పొదల్లో చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డారని, అయితే ఒకట్రెండు రోజులు ఎవరూ గమనించకపోయి ఉంటే వారు ఖచ్చితంగా చనిపోయి ఉండేవారని పోలీసులు తెలిపారు. ఇక ఈ రామదేవర బెట్టని దేశంలోని ఏకైక రాబందుల అభయారణ్యం. ఫేమస్ షూటింగ్ లొకేషన్‌లలో ఇది కూడా ఒకటి.