ఢిల్లీ : సీఎం తాపత్రయమంతా ఇదేనా ?

Vijaya


బీజేపీ నేత సీఎం రమేష్ తాపత్రయమంతా బయటపడింది. మీడియాతో ఏపీ వ్యవహారాల గురించి  మాట్లాడుతు ‘బీజేపీతో పొత్తున్న పార్టీకే రాష్ట్రంలో అధికారం’ అని చెప్పారు. నిజానికి రమేష్ చెప్పేది కలలో కూడా జరిగేమాట కాదు. ఎందుకంటే బీజేపీతో పొత్తున్నది జనసేనకు మాత్రమే. రెండుపార్టీలు కలిసి అధికారంలోకి రావటం కలలో కూడా సాధ్యంకాదు. వైసీపీని ఓడించాలంటే తెలుగుదేశంపార్టీని కూడా పొత్తులో కలుపుకోవాలని పవన్ పట్టుబడుతున్న కారణమిదే. అయితే చంద్రబాబునాయుడును నమ్మటంలేదు కాబట్టి టీడీపీతో పొత్తు వద్దని బీజేపీ అనుకుంటున్నది.





ఈ నేపధ్యంలో బీజేపీతో పొత్తున్న పార్టీకే రాష్ట్రంలో అధికారం అని సీఎం రమేష్ చెప్పటంలో అర్ధమేంటి ? ఎలాగైనా టీడీపీతో పొత్తుపెట్టుకునేట్లుగా బీజేపీ అగ్రనేతలను ఒప్పించేందుకు రమేష్, సుజనా చౌదరి లాంటి వాళ్ళు చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన రమేష్, సుజనా, గరికపాటి బీజేపీలోకి ఫిరాయించిందే చంద్రబాబు ప్రయోజనాలు కాపాడటం కోసమే అన్న వైసీపీ ఆరోపణలు అందరికీ తెలిసిందే.





అంటే వీళ్ళు లేదా ఇలాంటి వాళ్ళు బీజేపీలో చేరి చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారన్నమాట. ఇందులో భాగంగానే బీజేపీతో పొత్తున్న పార్టీకే అధికారం అని చెప్పింది. వీళ్ళు నిరంతరం మధ్యమధ్యలో పవన్ కూడా చంద్రబాబు తరపునే బీజేపీ అగ్రనేతలతో రాయబారాలు చేస్తుంటారట. ఈమధ్య పవన్ ఢిల్లీకి వెళ్ళింది కూడా చంద్రబాబు దూతగా పొత్తు కోసం ఒప్పించేందుకే అనే ప్రచారం జరుగుతోంది.





అయితే ఎవరెంత చెప్పినా పొత్తుల విషయం తేల్చాల్సింది నరేంద్రమోడీ మాత్రమే. మోడీ ఆలోచనల ప్రకారమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యవహరిస్తారు. ఇప్పటికైతే చంద్రబాబును దూరంగా పెట్టాలని మోడీ అనుకున్నారు కాబట్టే చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్నా బీజేపీకి దగ్గరకాలేకపోతున్నారు. ఈ సమయంలో చంద్రబాబు తరపున కొందరు పొత్తు సానుకూలం చేసేందుకు ప్రయత్నాలు చేస్తునే ఉంటారు. ఇపుడు రమేష్ చెప్పిందానిబట్టి బీజేపీతో టీడీపీకి పొత్తు కుదురుతుందన్న అర్ధమే వినిపిస్తోంది. లేకపోతే బీజేపీతో పొత్తున్న పార్టీకే అధికారం అని చెప్పటంలో అర్ధమేంటి ?







మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: