అమరావతి : పవన్ సీఎం అయిపోయినట్లేనా ?

Vijaya




జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయిపోయినట్లేనా ? ఎన్నికలు పెట్టడమే ఆలస్యం పోలింగ్ జరగటం, రిజల్ట్స్ డిక్లేర్ అవ్వటం, పవన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవటం అంతే అన్నట్లుగా ఉంది నాగబాబు మాటలు. ఈ మధ్యనే పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు కదా. దాని తాలూకు హ్యాంగోవర్ ఇంకా దిగినట్లు లేదు. అందుకనే ఉత్తరంధ్రలోని భీమిలీ నియోజకవర్గంలోని వీరమహిళలు, జనసైనికులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు.





జనసేన ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రజాయోగ్యమైన పరిపాలను అందించే విషయాలపైన ప్రధానంగా నాగబాబు చర్చించారు. నాగబాబు చర్చలు ఎలాగుందంటే పైన చెప్పినట్లుగా పవన్ సీఎం అవటమే మిగులుంది. ఎన్నికలు ఎప్పుడు ప్రకటించినా సిద్ధమట. ఎలా సిద్ధంగా ఉన్నారో పవన్+నాగబాబు+నాదెండ్లకే తెలియాలి. పట్టుమని పది నియోజకవర్గాల్లో కూడా పోటీచేయబోయే అభ్యర్ధులను ఇంతవరకు ప్రకటించలేదు. అసలు ఎన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీచేస్తుందో ఎవరికీ తెలీదు. ఎన్నికల్లో ఎలాగైనా పవన్ కు సమస్య తప్పదు. 





ఇంకా విచిత్రం ఏమిటంటే మిత్రపక్షం బీజేపీతోనే ఉంటుందా లేకపోతే తెగతెంపులు చేసుకుని టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందా కూడా నేతలకు తెలీదు. బీజేపీతో పొత్తు తెంచుకుని టీడీపీతో చేతులు కలిపేంత ధైర్యం పవన్ చేయలేకపోతున్నారు. విచిత్రం ఏమిటంటే బీజేపీతోనే ఉంటే ఏమవుతుందో అనే భయం. ఇదే సమయంలో టీడీపీతో పొత్తుపెట్టేసుకుంటే బీజేపీ ఏమిచేస్తుందో అనే టెన్షన్ పవన్లో పెరిగిపోతోంది.





ఇలాంటి భయాలతోనే పవన్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. బీజేపీతోనే ఉన్నా, టీడీపీతో పొత్తుపెట్టుకున్నా పవన్ సీఎం అయ్యేది కల్లమాత్రమే. ఈ విషయం ప్రతి ఒక్కళ్ళకి తెలుసు పవన్+నాగబాబుకు తప్పు. ఒకవేళ వీళ్ళకి కూడా ఈ విషయంలో క్లారిటి ఉంటే జనాలను మోసం చేయటానికి మాత్రమే పవన్ సీఎం అంటు అబద్ధాలు చెబుతున్నట్లు లెక్క. ఏదేమైనా పొత్తులు, ఎన్నికలు, ఫలితాలను పక్కనపెట్టేస్తే జనసేన నేతలు, జనసైనికులతో వీడియా కాన్ఫరెన్సుల్లో మాత్రం పవన్ సీఎం అయిపోయినట్లే నాదెండ్ల, నాగబాబు మాట్లాడటం మాత్రం పిచ్చ క్యామిడీగా ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: