అమెరికా : అమెరికాలో పెరిగిపోతున్న గన్ కల్చర్

Vijaya



తాజగా టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ కు 25 కిలోమీటర్ల దూరంలోని అలెన్ ప్రీమియం ఔట్ లెట్స్ అనే పెద్ద మాల్ లో జరిగిన కాల్పుల్లో 9 మంది చనిపోయారు. మరో నలుగురి పరిస్ధితి చాలా సీరియస్ గా ఉంది. విషయం తెలుసుకుని మాల్ కు చేరుకున్న పోలీసుల కాల్పుల్లో దుండుగుడు కూడా చనిపోయాడు. చనిపోయిన వాళ్ళల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన  అమ్మాయి తాడికొండ ఐశ్వర్య ఉన్నట్లు గుర్తించారు.



ఇక్కడ విషయం ఏమిటంటే అమెరికాలో గన్ కల్చర్ బాగా పెరిగిపోతోంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళవరకు చాలామంది చేతుల్లో తుపాకులుంటున్నాయి. తుపాకులు ఉంచుకునేందుకు ప్రభుత్వం లైసెన్సులు చాలా తేలిగ్గా ఇచ్చేస్తుంది. దాంతో చాలామంది తుపాకులు కొనుక్కుంటున్నారు. అమెరికా చట్టాల ప్రకారం తుపాకులు కలిగి ఉండటం జనాల వ్యక్తిగత స్వేచ్చ. అందుకనే అడిగిన వాళ్ళకి అడిగినట్లు ప్రభుత్వం లైసెన్సులో ఇచ్చేస్తోంది.



దీన్ని ఆధారంగా చేసుకుని చాలామంది తుపాకులు కొనేసుకుంటున్నారు. స్కూళ్ళకు వెళ్ళే మూడు, నాలుగు తరగతుల పిల్లల బ్యాగుల్లో కూడా తుపాకులు ఉంటున్నాయంటేనే గన్ కల్చర్ ఏ స్ధాయిలో పెరిగిపోతోందో అర్ధమవుతోంది. ఆమధ్య ఒక స్కూల్లో టీచర్ తో పాటు సహచర విద్యార్ధులను కాల్చిచంపింది 9 ఏళ్ళ పిల్లాడే అని తెలిసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. అలా ఎందుకు జరిగిందంటే స్కూళ్ళకు వచ్చే పిల్లలు లంచ్ బాక్స్ తెచ్చుకున్నట్లే తుపాకులు కూడా తెచ్చుకుంటున్నారు కాబట్టే.



దీన్ని అరికట్టే చట్టాలు అమెరికాలో లేకపోవటమే విచిత్రంగా ఉంది. ఒక అంచనా ప్రకారం అమెరికా జనాభా 34 కోట్లయితే అమ్ముడుపోయిన తుపాకులు సుమారు 50 కోట్లట. అంటే ఒక్కొక్కరి దగ్గర ఒకటికి మించే తుపాకులున్నట్లు అర్ధమవుతోంది. రెస్టారెంట్లు, బార్లు, షాపింగ్ మాల్సు, స్కూళ్ళు, సబర్బన్ రైళ్ళు, బస్టాండ్లు ఇలా ఒకటేమిటి జనాల రద్దీ ఎక్కడుంటుందని అనుకుంటే దుండగులు అక్కడ కాల్పులు జరిపేస్తున్నారు. యువతలో అభద్రత పెరిగిపోవటం, నిరుద్యోగిత పెరిగిపోతుండటం, వైవాహిక జీవితంలో సమస్యల్లాంటి వాటితో హింసా ప్రవృత్తి పెరిగిపోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి దీనికి ముగింపు ఎక్కడో తెలీదు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: