అమరావతి : కాపులను నమ్మించి దెబ్బకొట్టారా ? మరీ ఇంత అయోమయమా ?

Vijaya


ఎన్నో ఆశలు పెట్టుకున్న కొందరు కాపులతో పాటు కాపు సంక్షేమ సమితి అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య, సోదరుడు నాగబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాన్ పెద్ద షాకిచ్చారు. ముఖ్యమంత్రి రేసులో తాను లేనని తేల్చేశారు. ముఖ్యమంత్రి పదవి కావాలని అడగాలంటే అందుకు ఒకస్ధాయి ఉండాలని మీడియా సమావేశంలో చెప్పారు. పనిలోపనిగా నాగబాబు ఉత్సాహంపైన కూడా నీళ్ళు చల్లేశారు. నాగబాబు ఎక్కడ పర్యటించినా, ఎవరితో మాట్లాడినా రాబోయేది జనసేన ప్రభుత్వమే, కాబోయే ముఖ్యమంత్రి పవన్ కల్యాణే అని పదే పదే చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే.



ఇక జోగయ్య అయితే పదేపదే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పవన్  ఉంటేనే కాపులు జనసేనకు ఓట్లేస్తారని చెబుతున్న విషయం తెలిసిందే. పవన్ తాజా ప్రకటనతో జోగయ్యకు కూడా షాక్ కొట్టినట్లే అయ్యింది. జోగయ్య లెక్కప్రకారం ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పవన్ను ప్రకటిస్తారని, కాపులంతా కాపులు ఓట్లేస్తారని. మరిప్పుడు ముఖ్యమంత్రి రేసులో తాను లేనని స్వయంగా పవనే ప్రకటించారు. ఇపుడు జోగయ్య ఏమిచేస్తారు, జనసేనకు మద్దతుగా ఉండాలని అనుకుంటున్న కాపులు ఏమిచేస్తారు ?



ఇపుడిదే కాపు సామాజికవర్గంలో పెద్ద చర్చగా మారింది. 2019 ఎన్నికల్లో 30-40 సీట్లు వచ్చుంటే ఇపుడు ముఖ్యమంత్రి పదవిని అడిగి ఉండేవాళ్ళమని పవన్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. రానిసీట్లను వచ్చుంటే అని పవన్ చెప్పటం ఏమిటో అర్ధంకావటంలేదు. పార్టీ తరపున ఎంఎల్ఏలు లేనపుడు తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని అడిగినా ఉపయోగం ఉండదని పవనే అంగీకరించేశారు.



తన చేతిలో ఎంఎల్ఏ సీట్లు లేనపుడు టీడీపీ అయినా బీజేపీ అయినా తనను ఎందుకు సీఎంను చేస్తారంటు ఎదురు ప్రశ్నించారు. కండీషన్లు పెడితే ముఖ్యమంత్రి పదవి రాకపోగా చివరకు పొత్తుకూడా కుదరదని పవన్ తేల్చేశారు. సో, పవన్ తాజా మాటలతో ఆయనకు మద్దతుగా నిలవాలని అనుకుంటున్న వాళ్ళకి షాక్ తగిలినట్లే అనుకోవాలి. కాపులంతా తన ద్వారా చంద్రబాబునాయుడును సీఎంగా చేయటం కోసం ఓట్లేయాలని పవన్ చెప్పేసినట్లే అనుకోవాలి. మరి జనసేన+టీడీపీకి ఓట్లు వేస్తారో వేయరో కాపులే తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: