ఉత్తరాంధ్ర : టీడీపీ ఎంఎల్ఏని వాయించేసిన హైకోర్టు

Vijaya



అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిదాన్ని  ప్రభుత్వానికి ఆపాదించటం, కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం పేరుతో ప్రభుత్వాన్ని కోర్టుకు లాగటమే టార్గెట్ గా పెట్టుకున్నది తెలుగుదేశంపార్టీ. ఇప్పుడు కూడా అలాగే చేసింది. అయితే ఊహించని రీతిలో టీడీపీ ఎంఎల్ఏకే కోర్టు షాకిచ్చింది. ఫుల్లుగా తలంటుపోసింది. ఇంతకీ విషయం ఏమిటంటే వైజాగ్ లోని మధురవాడలో అప్పుడెప్పుడో రామానాయడు స్టూడియో నిర్మాణానికి ప్రభుత్వం స్ధలమిచ్చింది. అందులో నిర్మాణాలంటు కొంత ప్రాంతాన్ని యాజమాన్యం ఉపయోగించుకుంది.



వాటిల్లో ఏవో షూటింగులు కూడా జరుగుతున్నాయి. అయితే ఇంకా చాలా స్ధలం ఖాళీగానే ఉంది. అలాంటి భూమిలో ఈమధ్యనే స్టూడియో యాజమాన్యం రియల్ ఎస్టేట్ వెంచర్ వేసింది. లేఅవుట్ వేసేందుకు అనుమతివ్వాలంటు యాజమాన్యం దరఖాస్తు చేస్తే అందుకు మున్సిపల్ శాఖ అనుమతించింది. వెంటనే ప్రభుత్వంలో అక్రమాలు జరుగుతున్నాయని, జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కయ్యారంటు టీడీపీ ఎంఎల్ఏ వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో కేసు వేశారు.



ఈ కేసును విచారించిన కోర్టు చీఫ్ జస్టిస్ కొట్టేశారు. ప్రైవేటు భూముల్లో దాని యజమాని లేఅవుట్ వేసుకుని అమ్ముకోవాలని అనుకుంటే దానికి ప్రభుత్వానికి ఏమి సంబంధమని నిలదీసింది. ప్రైవేటువ్యవహారాలపై పిల్ ఏమిటంటు ఫుల్లుగా వాయించేసింది. ఇందులో అసలు ప్రజాప్రయోజనాలు ఏమున్నాయో చెప్పమని ప్రశ్నించింది. ప్రైవేటు వ్యక్తుల మధ్య లావాదేవీల్లో కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతు పిల్ వేయటం ఏమిటంటు మండిపడింది. ప్రైవేటు భూ వ్యవహారంలో ప్రభుత్వానికి ఏ విధంగా సంబంధం ఉందో  చెప్పమని అడిగింది.



కోర్టు ప్రశ్నలకు పిటీషనర్ ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారు. ధనికుల మధ్య వివాదంలో కోర్టులు జోక్యం చేసుకోవని చెప్పింది. ప్రజాప్రయోజనాల పేరుతో మరోసారి ఇలాంటి పిల్ వేయవద్దని హెచ్చరించింది. మొత్తానికి కోర్టులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై టీడీపీ చల్లుతున్న బురద మరోసారి చర్చకు వచ్చింది. కాకపోతే ఈ సారి కోర్టు టీడీపీకి ఆ అవకాశం ఇవ్వలేదు. ఇలాంటి పిల్లులను తెలుగుదేశంపార్టీ డైరెక్టుగాను లేకపోతే ఎవరినో ముందుపెట్టి కోర్టుల్లో చాలా కేసులే వేయించింది. వీటిల్లో కొన్నింటిని కోర్టు విచారణకు  స్వీకరిస్తే కొన్నింటిని కొట్టేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: