అమరావతి : లోకేష్ ఇంత భయపడుతున్నారా ?

Vijaya



తెలుగుదేశంపార్టీ మద్దతుదారులు, అభిమానులు చెప్పే లేటెస్టు విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో  నారా లోకేష్ రెండు నియోజకవర్గాల్లో పోటీకి రెడీ అవుతున్నారట. మంగళగిరిలో పోటీచేయటంతో పాటు రెండో నియోజకవర్గంపైన కూడా సర్వే చేయించుకున్నారట. సర్వే ప్రకారం కర్నూలు జిల్లాలోని నంద్యాల, అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గంలో పోటీచేస్తే ఎలాగుంటుందనే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇంత అర్జంటుగా రెండో నియోజకవర్గంలో కూడా పోటీచేయాలనే ఆలోచన ఎందుకు వచ్చినట్లు ?



ఎందుకంటే మంగళగిరిలో గెలుపు డౌటులో పడింది కాబట్టే. 2019 ఎన్నికల్లో ఏరికోరి మంగళగిరిలో పోటీచేసి ఓడిపోయారు. నిజానికి ఈ నియోజకవర్గం టీడీపీకి ఏమంత సేఫ్ కాదు. చాలామంది వద్దనిచెప్పినా వినకుండా లోకేష్ పోటీచేసి ఓడిపోయారు. రేపటి ఎన్నికల్లో మళ్ళీ ఇక్కడే పోటీచేసి గెలుస్తానని చాలెంజ్ చేశారు. అయితే గెలుపుకు అవసరమైన స్ట్రాటజీలు ఏమన్నా ఉన్నాయా అంటే అదేమీలేదు. వైసీపీ మీద జనాల్లో ఉన్న వ్యతిరేకతే తనను గెలిపిస్తుందనే భ్రమల్లో ఉన్నారు.



అయితే రాజధాని అమారవతి ప్రాంతంలో పేదలకు ఇళ్ళపట్టాల పంపిణీ జరగబోతోంది కదా. దాంతో లోకేష్ లో టెన్షన్ మొదలైందట. ఎందుకంటే 50 వేలమందికి పట్టాలు ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. 50వేల మందికి పట్టాలంటే సుమారు 1.5 లక్షల మంది ఓటర్లనే అనుకోవాలి. వీళ్ళల్లో మంగళగిరిలోనే సుమారు 80 వేలమంది ఉంటారట. అంటే ఇపుడున్న జనాలను నమ్ముకుంటే కష్టమనే జగన్ 1.5 లక్షల మంది కొత్త ఓటుబ్యాంకును సృష్టించుకుంటున్నారు. వీళ్ళంతా గనుక వైసీపీకి ఓట్లేస్తే లోకేష్ కు రెండోసారి కూడా ఓటమి ఖాయం.



తాజా పరిణామాలతో టెన్షన్ పెరిగిపోయి రెండో నియోజకవర్గంలో పోటీకి ఆలోచించారట. ఆ ఆలోచనలో నుండి పుట్టుకొచ్చిందే నంద్యాల, కల్యాణదుర్గం నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాల్లోనే పోటీకి లోకేష్ ఎందుకు ఆసక్తిగా ఉన్నారో తెలీదు. ఎందుకంటే ఇవికూడా టీడీపీకి ఏమంత సేఫ్ నియోజకవర్గాలు కావు. కాకపోతే ఈ నియోజకవర్గాల్లో టీడీపీ బ్రహ్మాండంగా బలపడిందని నామినేషన్ వేస్తే గెలుపు ఖాయమని లోకల్ నేతలేమైనా లోకేష్, చంద్రబాబునాయుడుకు చెప్పుండాలి. వాళ్ళని నమ్మి లోకేష్ పై నియోజకవర్గాల్లో పోటీకి ఆలోచిస్తున్నట్లున్నారు. ‘దిగితేనే కదా లోతు తెలిసేది’ చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: