అమరావతి : కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరిగాయా ?

Vijaya


వచ్చేఎన్నికల్లో జనాలు మళ్ళీ తననే గెలిపిస్తారనే నమ్మకం జగన్మోహన్ రెడ్డిలో బాగా పెరిగిపోయినట్లు కనబడుతోంది. గెలుపుపై పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు అర్ధమవుతోంది. పల్నాడులోని క్రోసూరులో విద్యాకానుక కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతు తన పరిపాలన వల్ల మంచి జరిగిందని అనుకుంటే రాబోయే ఎన్నికల్లో వైసీపీనే గెలిపించాలని జనాలను కోరారు. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లాగ తమనే గెలిపించాలని ప్రజలను అడగలేదు.





ప్రజలకు మంచిచేస్తున్న తన ప్రభుత్వం కావాలో లేకపోతే అందినకాడికి దోచుకుతిన్న చంద్రబాబునాయుడు ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలని జనాల విచక్షణకే వదిలేశారు. తన ప్రభుత్వంలో ప్రతి ఇంట్లో ఏదో ఒక పథకం ద్వారా లబ్దిపొందిన వాళ్ళున్నారని జగన్ చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. అందుకనే తన పథకాల ద్వారా లబ్దిపొందామని అనుకుంటేనే తనకు ఓట్లేసి గెలిపించమని చెప్పారు. ఈ ధీమా ఎప్పుడు వస్తుందంటే ప్రజలు తప్పకుండా వైసీపీకే ఓట్లేసి గెలిపిస్తారన్న నమ్మకం ఉన్నపుడే.





అంటే ఎన్నికల్లో విజయంపై జగన్లో కాన్ఫిడెన్స్ లెవల్స్ బాగా పెరిగిపోయినట్లు అర్ధమవుతోంది. కాన్ఫిడెన్స్ ఉండటం మంచిదే కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ లాగ మారకూడదు. మొన్ననే టీడీపీ సీనియర్ తమ్ముడు దేవినేని ఉమ మాట్లాడుతు కచ్చితంగా గెలుస్తామన్న అహంకారం వల్లే 2019లో మైలవరం, నందిగామలో తనతో పాటు సౌమ్య ఓడిపోయామన్నారు. ఓడిపోయిన నాలుగేళ్ళ తర్వాత నిజం ఒప్పుకునే ధైర్యం దేవినేనికి ఇపుడొచ్చింది. అలాంటి పరిస్ధితే తనకు రాకూడదని జగన్ అనుకుంటే ఓవర్ కాన్ఫిండెన్స్ ఉండకూడదు.





రేపటి ఎన్నికల్లో ఓడిపోతే తన పరిస్ధితి ఏమిటో జగన్ కు బాగానే తెలుసు. అందుకనే పార్టీ నేతల సమీక్షలు, క్యాబినెట్ సమావేశాల్లో గెలుపుపై ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దని జగన్ పదేపదే చెబుతున్నది. గడపగడపకు వైసీపీ కార్యక్రమం పెట్టి మంత్రులు, ఎంఎల్ఏలను జనాల దగ్గరకు పదేపదే తిప్పుతున్న కారణం కూడా ఇదే. మొత్తానికి ఓట్లేసే విషయంలో జగన్ జనాలకు ఆప్షన్ ఇచ్చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: