గోదావరి : నవ్వుల పాలవుతున్న పవన్

Vijaya


రోజుకో మాట..పూటకో ప్రకటన..ఈరోజు చెప్పిన మాటలకు రేపు విరుద్ధంగా మాట్లాడటం. ఇలాంటి చేష్టలతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తనంతట తానే జనాల్లో నవ్వుల పాలవుతున్నారు. మరి పవన్ కు మతిమరుపు వ్యాధి ఉందో లేకపోతే స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళే అలా రాసిస్తున్నారో అర్ధంకావటంలేదు. ఏదేమైనా ముందు వెనకా ఆలోచించకుండా, మొన్న ఏమిచెప్పామో గుర్తుపెట్టుకోకుండా దానికి విరుద్ధంగా మాట్లాడటం వల్లే పవనే నవ్వుల పాలవుతున్నారు.



తాజాగా మొదలైన వారాహి యాత్రలో ఈ విషయం స్పష్టమైంది. కత్తిపూడి బహిరంగసభలో ఏమిచెప్పారు ఒంటరిగా పోటీచేయాలా ? లేకపోతే పొత్తులు పెట్టుకుని పోటీచేయాలా అన్న విషయాన్ని ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. ప్రజలందరు ఇస్తే ముఖ్యమంత్రి పదవిని సంతోషంగా స్వీకరిస్తానని చెప్పారు. ఇదే అంశాలపై కొద్దిరోజుల ముందు ఏమిచెప్పారో చూద్దాం. ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించమని అడగటానికి కూడా తనకు అర్హతలేదన్నారు.



సీఎం అభ్యర్ధిగా ప్రకటించమని అడగాలంటే జనసేనకు కనీసం 35-40 ఓటుబ్యాంకు ఉండాలన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని అడగాలన్నా తనకు అర్హతలేదని పవనే స్వయంగా చెప్పారు. అభ్యర్ధిగా ప్రకటించేందుకు కూడా తనకు అర్హత లేదని అంగీకరించిన పవన్ సడెన్ గా ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తానని చెప్పటంఏమిటి ? అభ్యర్ధిగా ప్రకటనకే అర్హత లేకపోతే ఏకంగా సీఎం అయిపోదామని ఎలాగ అనుకున్నారు. ఇక పోటీ విషయంలో నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు.



పొత్తులా లేకపోతే సొంతంగా పోటీచేయాలా అని ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. మరి కొద్దిరోజుల ముందు ఒంటరిగా పోటీచేస్తే జనసేనకు వీరమరణమే అన్న విషయం తనకు బాగా తెలుసున్నారు కదా. జగన్మోహన్ రెడ్డిని పదవిలో నుండి దింపాలంటే కచ్చితంగా టీడీపీతో పొత్తుండాల్సిందే అని పవనే చెప్పారు కదా. టీడీపీతో పొత్తు పెట్టుకునే ఎన్నికల్లో పోటీచేస్తామని చెప్పిన విషయాన్ని మరచిపోయారా ? ఏరోజు ఏమి మాట్లాడుతారో తెలీదు, ఏమి మాట్లాడాలో కూడా తెలీదు. అయినా ఏపీకి ముఖ్యమంత్రి అయిపోవాలనే కోరిక మాత్రం బలంగా ఉంది. తనను అసెంబ్లీలోకి ఎంటరవ్వకుండా ఎవరాపుతారో చూస్తానని చాలెంజ్ విసిరారు. పవన్ను ఆపుతున్నదే జనాలు. ఓట్లేయకుండా ఓడగొట్టిందే జనాలన్న విషయం కూడా మరచిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: