కేదర్‌నాథ్ టెంపుల్: 23 కిలోల గోల్డ్‌ చోరీ?

Purushottham Vinay
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కేదర్‌నాథ్ ఆలయంలో 23 కిలోల గోల్డ్‌ చోరీకి గురైందని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆలయానికి సమర్పించిన 23.78 కిలోల బంగారం చోరీకి గురైందని కేదార్‌నాథ్ ధామ్‌కు చెందిన తీర్థ పురోహిత్, చార్ధామ్ మహాపంచాయత్ ఉపాధ్యక్షుడు అయిన సంతోష్ త్రివేది ఆరోపించారు.ముంబైకి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ విరాళంగా ఇచ్చిన ఆ బంగారాన్ని ఆలయ గర్భగుడి గోడలపై పొరలుగా వేశారు. కేదార్‌నాథ్ ఆలయ గర్భగుడిలో బంగారు అలంకరణలో ఆర్థిక అవకతవకలు జరిగాయని గత సంవత్సరం కేదర్‌నాథ్ ఆలయానికి సంబంధించిన కొందరు పూజారులు ఆరోపించారు. కానీ BKTC (బద్రీనాథ్, కేదర్‌నాథ్ ఆలయ కమిటీ) అలాంటి ఆరోపణలు నిరాధారమైనవని, ఇదంతా కూడా ఒకరకమైన కుట్రకోణంగా ఖండించింది. గత ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌ నెలలలో ఆలయ గర్భగుడిలో బంగారు తాపడం పనులు జరిగాయని త్రివేది ఆరోపించారు. ఆ బంగారు పలకలు అమర్చినట్లయితే, పాలిషింగ్ అవసరం ఏమిటి? ఈ విషయం పురావస్తు శాఖకు గానీ ఇంకా యాత్రికులకు గానీ తెలియదు.



ఇప్పుడు దీనిపై పూర్తిగా విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.ముంబైకి చెందిన ఆ దాత బంగారాన్ని విరాళంగా ఇచ్చాడనే అనుమానం ఉందని కాంగ్రెస్ నేత ఇంకా ఉత్తరాఖండ్ మాజీ మంత్రి అయిన నవప్రభాత్ అన్నారు. విరాళంగా వచ్చిన ఆ బంగారం ఎంత?ఆ బంగారాన్ని రాగి ఎందుకు కలిపారు? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. కేదర్‌నాథ్ మాత్రమే కాదు ఇంకా బద్రీనాథ్‌కు కూడా ఇలాంటి స్కామ్‌పై సమాచారం అందుతున్నదని ఆయన అన్నారు.ఇక ఈ పెరుగుతున్న వివాదం మధ్య, ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పుడు సాంస్కృతిక, మత వ్యవహారాల కార్యదర్శి హరిచంద్ర సెమ్వాల్, గర్వాల్ కమిషనర్ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఆ కమిటీలో నిపుణులతో పాటు స్వర్ణకారులు ఉంటారని రాష్ట్ర పర్యాటక, మత, సాంస్కృతిక శాఖ మంత్రి సత్పాల్ మహరాజ్ తెలిపారు. తప్పు చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: