హైదరాబాద్ : బీజేపీ పరువు తీసేసిన సొంత నేత

Vijaya



తెలంగాణాలో పార్టీ పరిస్ధితి ఏమిటో బీజేపీ నేత చేసిన ట్వీట్లో జనాలందరికీ అర్ధమైపోయింది. మహబూబ్ నగర్ కు చెందిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్టుచేశారు. ఆ వీడియోలో ఏముందంటే ఒక దున్నపోతును వాహనంలోకి ఎక్కించేందుకు ఒకతను దాన్ని వెనుకనుండి తంతుంటాడు. అతను తంతేకానీ దున్నపోతు వాహనంలోకి ఎక్కదు. అతను తన్నిన తర్వాత దున్నపోతు వాహనంలోకి ఎక్కగానే సదరు వ్యక్తి వాహనం తలుపు వేసేస్తాడు.





దానికి మాజీ ఎంజీ కాప్షన్ గా ఏమి పెట్టారంటే తెలంగాణాలో బీజేపీ నాయకత్వానికి ఇలాంటి ట్రీట్మెంట్ చాలా అవసరమని చెప్పారు.  మాజీ ఎంపీ ట్వీట్ పోస్టుచేయటమే కాకుండా దాన్ని అమిత్ షా, బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్ తదితరులకు ట్యాగ్ కూడా చేశారు. మాజీ ఎంపీ చేసిన పోస్టు కొద్దిసేపటికే బాగా వైరల్ అయిపోయింది. అయితే కొద్దిసేపటి తర్వాత పోస్టును తొలగించారు. కారణం ఏమిటంటే జితేందర్ చేసిన పోస్టుపై అమిత్ తో పాటు అగ్రనేతలు తీవ్రంగా మండిపోయారట.





పోస్టును చూసిన ప్రతిపక్షాలు,  జనాలు ఏమనుకుంటారంటు నిలదీశారట. దాంతో తానుపెట్టిన వీడియోను డిలీట్ చేసేశారు.  పెట్టిన వీడియోను డిలీట్ చేయటంతోనే జింతేదర్ కు ఏ స్ధాయిలో అక్షితలు పడ్డాయో అర్ధమైపోతోంది. ఇంత సెటైరికల్ వీడియోను పోస్టుచేయాల్సిన అవసరం మాజీ ఎంపీకి ఏమొచ్చింది ? ఏమొచ్చిందంటే పార్టీ అగ్రనేతలపై చాలాకాలంగా జితేందర్ బాగా అసంతృప్తిగా ఉన్నారట.





ఎందుకంటే ఒకపుడు బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పుకున్న ఊపు ఇపుడు ఎక్కడా కనబడటంలేదట. ఇతర పార్టీల్లో నుండి బీజేపీలో చేరే నేతలు కూడా ఎవరు కనబడటంలేదట. ఇదే సమయంలో కాంగ్రెస్ రెట్టించిన ఉత్సాహంతో మంచి దూకుడుమీదుంది. కర్నాటక ఎన్నికల్లో ఘనవిజయం సాధించటంతో ఇక్కడి కాంగ్రెస్ నేతల్లో కూడా ఒక్కసారిగా జోష్ పెరిగిపోయిందట.  నేతల చేరికలతో ఒకవైపు కాంగ్రెస్ లో ఉత్సాహం పెరిగిపోతుంటే మరోవైపు బీజేపీ పూర్తిగా డీలాపడిపోతోందట. అందుకనే తనలోని మంటను జితేందర్ వీడియో రూపంలో పోస్టుచేశారని కమలనాదులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: