ఢిల్లీ : వివేకా హత్యకేసు దర్యాప్తులో సీబీఐ ఏమి చేయబోతోంది ?

Vijaya


వివేకానందరెడ్డి మర్డర్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశముంది. గతంలో సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారమైతే దర్యాప్తును శుక్రవారం అంటే జూన్ 30వ తేదీకల్లా పూర్తిచేసి ఫైనల్ చార్జిషీటును దాఖలు చేయాలి. అయితే సీబీఐ దర్యాప్తు పూర్తికాలేదు. అసలు ఏ దశలో ఉందో కూడా అర్ధంకావటంలేదు. దర్యాప్తంతా వివేకా కూతురు సునీత అనుకుంటున్నట్లు కడప ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూనే సాగింది. ఎలాగైనా అవినాష్ ను హత్యకేసులో జైలుకు పంపించాలన్న సునీత కోరికను నెరవేర్చే బాధ్యతను సీబీఐ తీసుకున్నట్లుంది.





అరెస్టుచేయాలని శతవిధాల ప్రయత్నించింది కానీ అరెస్టుచేయటానికి అవసరమైన సాక్ష్యాలను మాత్రం సంపాదించలేకపోయింది. హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ అడిగిన ప్రశ్నల్లో దేనికి కూడా సీబీఐ సమాధానాలు చెప్పలేకపోయింది. అందుకనే లక్ష్మణ్ ఎంపీకి బెయిల్ ఇచ్చారు. దాన్ని రద్దుచేయించేందుకు సునీత మళ్ళీ సుప్రింకోర్టులో పిటీషన్ వేసినా పెద్దగా ఉపయోగం కనబడలేదు. ముందస్తు బెయిల్ కేసు విచారణను జూలై 3వ తేదీకి వాయిదావేసింది. కాబట్టి వివేకా కేసు ఛార్జిషీటు దాఖలకు మరింత గడువు కావాలని సీబీఐ ప్రత్యేక పిటీషన్ వేసే అవకాశాలున్నాయి.





ఎంపీ ముందస్తు బెయిల్ పిటీషన్ రద్దు విచారణను జూలై 3కి సుప్రింకోర్టు వాయిదా వేసింది కాబట్టి అదే పద్దతిలో ఫైనల్ చార్జిషీటు దాఖలకు మరింత గడువు కోరే అవకాశాలు కనబడుతున్నాయి. దర్యాప్తు వివరాలతో మధ్యంతర చార్జిషీట్ దాఖలు చేయాలని సీబీఐ డిసైడ్ అయినట్లు సమాచారం.





అవినాష్ ను కస్టడీకి ఇస్తే కానీ దర్యాప్తు పూర్తికాదని సీబీఐ కోరే అవకాశం ఉందట. అయితే కస్టడీ విచారణ అవసరంలేదని హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ ఇదివరకే స్పష్టంచేశారు. మరి సుప్రింకోర్టు ఏమంటుందో చూడాలి. మరి జూలై3వ తేదీ విచారణలో సుప్రింకోర్టు కూడా జస్టిస్ లక్ష్మణ్ అభిప్రాయానికే మద్దతుగా స్పందించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే సుప్రింకోర్టులో విచారణ సందర్భంగా సుప్రింకోర్టు జడ్జీలు మాట్లాడుతు అవినాష్ ను అరెస్టు చేయించటమే లక్ష్యంగా పెట్టుకున్నారా అని సునీతను ప్రశ్నించిన విషయం తెలిసిందే. మరి శుక్రవారం ఏమి జరుగుతుందో చూడాల్సిందే.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: