జూ. ఎన్టీఆర్ అభిమాని హత్యతో టీడీపీ రాజకీయమా?
నిజానికి శ్యామ్ సూసైడ్ వీడియో నోట్ లో చెప్పింది ఒకటి, ఆ తర్వాత శ్యామ్ కుటుంబ సభ్యులు చెప్పేది మరొకటి అని అంటున్నారు కొంతమంది. శ్యామ్ తను చనిపోయేటప్పుడు చివరిగా తీసుకున్న వీడియోలో తాను సరిగ్గా చదవనని కాబట్టి తనకు ఉద్యోగాలు రావని, కాబట్టి తాను తన ఫ్యామిలీకి బరువు అన్నట్లుగా చెప్పాడు. అయితే శ్యామ్ చెల్లెలు పద్మిని తన అన్నయ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెప్తుంది.
తమకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండగా నిలబడ్డారని ఆమె చెప్తుంది. తన అన్నయ్య శ్యామ్ తనకు ఇష్టమైన హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కూడా చేశాడని చెప్తుంది. శ్యామ్ తల్లిదండ్రులు తమ బిడ్డ మృతిపై తమకు ఎవరి మీదా అనుమానం లేదని, అంతేకాకుండా శ్యామ్ మృత దేహాన్ని చూసినప్పుడు అందరూ అది హత్యే అంటున్నారని కూడా వాళ్ళు అంటున్నారు. విచారణ చేసి త్వరగా నిజాలు ఏంటో నిరూపించాలని శ్యామ్ తల్లిదండ్రులు కోరుతున్నారు.
అయితే శ్యామ్ వీడియోను, ఇంకా ఆ శ్యామ్ కుటుంబ సభ్యుల మాటలను ఈ రెండిటిని చూసిన వాళ్ళకి అర్థం అవ్వని విషయం ఒకటే. అదేంటంటే శ్యామ్ తన సూసైడ్ వీడియో నోట్లో తాను తన కుటుంబానికి భారం అని చనిపోతున్నానని చెప్పడం జరిగింది. అయితే శ్యామ్ కుటుంబ సభ్యులు మాత్రం శ్యామ్ సూసైడ్ చేసుకోలేదని అంటున్నారు. అయితే శ్యామ్ కుటుంబ సభ్యుల ఈ విధంగా మాట్లాడటం వెనక తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రోత్సాహం ఉందని అంటున్నారు.