అమరావతి : సోము అవుట్..కారణాలివేనా ?

Vijaya


చడీ చప్పుడు లేకుండా ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలనుండి సోమువీర్రాజును తప్పించేశారు. అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించారు. అధ్యక్షుడిగా తప్పిస్తున్నట్లు వీర్రాజుకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. వీర్రాజును తప్పిస్తారని చాలాకాలంగా అనుకుంటున్నదే. అయితే ఫోన్ చేసి బాధ్యతలనుండి తప్పించినట్లు చెబుతురాని ఎవరు ఊహించలేదు. బాధ్యతలనుండి తప్పిచేటపుడు ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడుతారు. తర్వాత అధ్యక్షుడితో రాజీనామా చేయిస్తారు. అయితే అధ్యక్షుడిగా తప్పించినట్లు ఫోన్లో చెప్పటం బహుశా ఇదే మొదటిసారేమో.



ఇంతకీ వీర్రాజును తప్పించటం వెనుక ఏమి జరిగింది ? పార్టీలోని బలమైన వర్గం వీర్రాజు తొలగింపుకు కారణమని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఎల్లోమీడియాకు, చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కు వీర్రాజు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. చంద్రబాబుతో పొత్తును వీర్రాజు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలని పవన్ తో పాటు బీజేపీలోని సుజనాచౌదరి, సీఎం రమేష్, సత్యకుమార్, టీజీ వెంకటేష్, విష్ణుకుమార్ రాజు+వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తదితరులు బలంగా వాదిస్తున్నారు.



ఈ నేపధ్యంలోనే వీర్రాజు అధ్యక్షుడిగా ఉన్నంతవరకు పొత్తు వ్యవహారం స్మూత్ గా నడవదని వ్యతిరేకవర్గానికి అర్ధమైపోయింది. అందుకనే ఢిల్లీస్ధాయిలోనే లాబీయాంగ్ చేసి బాధ్యతలనుండి తప్పించినట్లుగా ప్రచారం జరుగుతోంది. వ్యతిరేకవర్గం ఆలోచనలకు అగ్రనేతలు సానుకూలంగా స్పందిస్తే సత్యకుమార్ అధ్యక్షుడిగా నియమించాలని అనుకున్నారట. వీర్రాజు వ్యతిరేకవర్గం మొత్తాన్ని కలిపిన ఏకైక కామన్ పాయింట్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకమే. పైన చెప్పుకున్న నేతలంతా జగన్ అంటేనే తీవ్రస్ధాయిలో మండిపోతుంటారు. అయితే అనూహ్యంగా అగ్రనేతలు పురంధేశ్వరిని నియమించారు.



పురందేశ్వరితో కాలిపి వీళ్ళల్లో చాలామందికి జనాల్లో అసలు పట్టేలేదు.  వీళ్ళుసొంతంగా పోటీచేస్తే డిపాజిట్లు తెచ్చుకునేది కూడా అనుమానమే. ఇలాంటి వాళ్ళంతా బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటిపరిస్దితుల్లో జనబలం లేని వాళ్ళల్లో ఎవరిని ప్రెసిడెంటుగా నియమించినా ఒకటే. చంద్రబాబుతో పొత్తుపెట్టుకోవాలని నరేంద్రమోడీ నిర్ణయిస్తే వీర్రాజయినా చేయగలిగేదేమీలేదు. కానీ టీడీపీతో పొత్తు నేపధ్యంలో అధ్యక్షుడిగా వీర్రాజు వద్దని వీళ్ళంతా బలంగా వాదించారట. అందుకనే సడెన్ గా వీర్రాజును తప్పించేశారు. కాకపోతే సత్యకుమార్ అధ్యక్షుడవుతారని అనుకుంటే పురంధేశ్వరయ్యారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: