గోదావరి : పవన్ కు వచ్చిన ఫీడ్ బ్యాక్ కరెక్టేనా ?

Vijaya


వచ్చేఎన్నికల్లో ఎలాగైనా సరే ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచితీరాలన్నది జనసేన అధినేత పవన్ కల్యాన్ పట్టుదల. వచ్చేసారి కూడా గెలవకపోతే పవన్ పరువంతా పోవటం ఖాయం. అందుకనే గెలుపుకు నానా అవస్తలు పడుతున్నారు. ఆ అవస్తల్లో నుండి వచ్చేఎన్నికల్లో కూడా గెలుస్తాననే నమ్మకంలేదని ఒకసారి, తాను పోటీచేయబోయే నియోజకవర్గాన్ని ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి ఓడగొట్టేందుకు రు. 200 కోట్లు ఖర్చుపెడతారని మరోసారి పిచ్చిపిచ్చిగా మాట్లాడారు.



సరే ప్రస్తుత విషయానికి వస్తే రాబోయే ఎన్నికల్లో పవన్ భీమవరంలోనే పోటీచేయబోతున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది. ఎందుకంటే వారాహియాత్రలో భీమవరంలో మాట్లాడిన మాటల వల్లే తాను పోటీచేయబోయే నియోజకవర్గం ఇదే అని పవన్ సంకేతాలిచ్చారనే ప్రచారం జరుగుతోంది. అయితే రెండురోజుల తర్వాత అంటే నరసాపురం నియోజకవర్గంలో పర్యటించి యాత్రకు బ్రేక్ ఇచ్చిన తర్వాత సంగతి చెప్పేది. ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే భీమవరంలో పోటీ ఫలితంపైన.



ఇంతకీ విషయం ఏమిటంటే పవన్ గనుక భీమవరంలో పోటీచేస్తే గెలుపు అవకాశాలు లేవట. ఎందుకుగెలవరు అనంటే గెలవరంతే. పవన్ గెలుపుపై ఒక సంస్ధ సర్వే చేసిందట. ఆ సర్వేలో పవన్ కు చాలా పూర్ రెస్పాన్స్ వచ్చిందట. పవన్ కు ఓట్లేయటానికి చాలామంది ఇష్టపడటంలేదట. పవన్ కు ఓట్లేస్తామని చెప్పేవాళ్ళు ఎవరంటే కేవలం తన అభిమానులు మాత్రమేనట.



కాపుల్లో కూడా అభిమానులు తప్ప మిగిలిన వాళ్ళల్లో ఎక్కువమంది పవన్ కు ఓట్లేయమని చెప్పారట. ఇక ఇతర సామాజికవర్గాల్లో అయితే పవన్ లేదా జనసేనకు ఓట్లేయటానికి ఇష్టంలేదని తెగేసి చెప్పేశారట. ఇదంతా చూసిన తర్వాత భీమవరంలో పవన్ పోటీచేస్తే గెలుపు కష్టమనే విషయం సర్వేలో తేలిపోయిందట. ఇపుడే కాదు 2019లో కూడా పవన్ రెండు నియోజకవర్గాల్లో పోటీకి రెడీ అవ్వగానే ఇలాంటి ప్రచారమే మొదలైంది. భీమవరం, గాజువాకల్లో పవన్ గెలవడని ముందునుండే ప్రచారం మొదలైపోయింది. దాని ప్రభావమేనేమో చివరకు రెండుచోట్లా ఓడిపోయారు. మరి రేపటి ఎన్నికల్లో ఏమిచేస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: