గోదావరి : నిజంగానే పవన్ అంత పాపులర్ లీడరా ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు, విమర్శలు చేయటాన్ని కాపు సంక్షేమ సేన అధినేత చేగొండి హరిరామజోగయ్య తట్టుకోలేకపోతున్నారు. పవన్ను ఎవరన్నా ఏమన్నా అంటే పవన్ కన్నా ముందు జోగయ్య రెచ్చిపోతుంటారు. జోగయ్య ఉద్దేశ్యంలో పవన్ ఎవరిని ఏమైనా అనచ్చు కానీ పవన్ను మాత్రం ఎవరు ఏమీ అనకూడదు. జగన్-పవన్ మధ్యలో చాలా అంశాలపై ఆరోపణలు, విమర్శలు హద్దులను దాటేసిన విషయం అందరికీ తెలిసిందే.
జగన్ తల్లి, చెల్లిని గురించి పవన్ చాలాసార్లు ఆరోపించారు. అందుకనే జగన్ కూడా పవన్ను ఉద్దేశించి మూడు పెళ్ళిళ్ళు, దత్తపుత్రుడంటూ పదేపదే ర్యాగింగ్ చేస్తున్నది. తాజాగా చిత్తూరు బహిరంగసభలో పవన్ను ఉద్దేశించి జగన్ ప్రస్తావించిన మూడుపెళ్ళిళ్ళు, దత్తపత్రుడు వ్యాఖ్యాలపై జోగయ్యకు బాగా మండినట్లుంది. అందుకనే జగన్ను ఉద్దేశించి జోగయ్య పెద్ద లేఖ విడుదలచేశారు. ఆ లేఖలో జోగయ్య కూడా హద్దు దాటేశారు. జగన్ను పట్టుకుని ‘ముఖ్యమంత్రిగా మీ ప్రవర్తన చూస్తుంటే మీరసలు వైఎస్సార్ కే పుట్టారా’ అనే అనుమానం వ్యక్తంచేశారు.
జగన్ పైన తానుచేసిన కామెంట్ జోగయ్యకు తప్పు అనిపించలేదేమో. ఇదే సందర్భంలో పవన్ను ఉద్దేశించి జోగయ్య ప్రజల ఆరాధ్య నాయుకుడు అని సంభోదిచటమే పెద్ద జోకుగా తయారైంది. పవన్ ప్రజల ఆరాధ్య నాయుకుడు, ప్రతిపక్ష నాయకుడట. నిజంగానే జోగయ్య చెప్పినట్లు పవన్ ప్రజల ఆరాధ్య నాయుకుడు అయితే పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోను ఎందుకు ఓడిపోయారు.
2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయటానికే భయపడే పవన్ ప్రజల ఆరాధ్య నాయకుడు ఎలా గయ్యారో అర్ధంకావటంలేదు. రేపటి ఎన్నికల్లో తాను పోటీచేయబోయే నియోజకవర్గాన్ని ప్రకటించటానికే పవన్ భయపడుతున్నారు. పోటీచేయబోయే నియోజకవర్గాన్ని ఇపుడే ప్రకటిస్తే తనను ఓడించటానికి జగన్ రు. 200 కోట్లు ఖర్చుచేస్తారని స్వయంగా పవనే ప్రకటించారు. దాంతో జగన్ అంటే పవన్ ఎంత భయపడుతున్నారనే విషయం జనాలందరికీ అర్ధమైంది. పవన్ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకేమిటని జగన్ను జోగయ్య ప్రశ్నించటం బాగానే ఉంది. మరి జగన్ తల్లి, చెల్లిగురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారని పవన్ను కూడా జోగయ్య నిలదీసుంటే బాగుండేది.