అమరావతి : చంద్రబాబుకు సీబీఐ షాక్
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి, దేశంలో టెక్నాలజీకి ఆధ్యుడిని తానే అని చెప్పుకునే చంద్రబాబునాయుడుకు సిబీఐ పెద్ద షాకే ఇచ్చింది. ఏ విషయంలో షాకిచ్చిందంటే వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో. వివేకా హత్యకేసులో ఉదయకుమార్ రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధంలేదని ఫైనల్ చార్జిషీట్లో చెప్పింది. మరి భాస్కర్ రెడ్డి, ఉదయ్ ను సీబీఐ ఎలా అరెస్టుచేసింది ? ఎలాగంటే గూగుల్ టేకవుట్ అనే సాంకేతిక ద్వారానే. ఇదే పద్దతిలో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా నిందితుడిగా చేర్చింది.
అయితే సీబీఐ కోర్టులో దాఖలుచేసిన ఫైనల్ చార్జిషీట్లో గుగుల్ టేకవుట్ సాంతికేతను రీడ్ చేయటంలో తాము తప్పుచేసినట్లు అంగీకరించింది. వివేకా హత్య కేసులో హంతకులకు భాస్కర్, అవినాష్ కు సంబంధాలున్నాయని వాళ్ళమధ్య ఫోన్ సంభాషణలు జరిగాయనేందుకు గూగుల్ టేక్ అవుట్ సాంకేతికతే ఆధారమని సీబీఐ ఇంతకాలం వాదించింది. దీన్ని పట్టుకుని చంద్రబాబు నానా రచ్చ చేశారు. ఒకవైపు గూగుల్ టేక్ అవుట్ శాస్త్రీయ ఆధారం కాదని నిపుణలు చెబుతున్నా చంద్రబాబు ఒప్పుకోలేదు.
వివేకా హత్యకు అవినాష్, భాస్కర్ రెడ్డికి సంబంధం ఉందని గూగుల్ టేక్ అవుట్ తేల్చేసిందంటు ఊరావాడ తిరిగి విపరీతంగా ప్రచారం చేశారు. హంతకులతో అవినాష్, భాస్కర్ కు సంబంధాలున్నాయని గూగుల్ టేక్ అవుట్ లో తేలిపోయింది కాబట్టి హత్యలో జగన్మోహన్ రెడ్డి పాత్రుందని బయటపడిందని సంబంధంలేకుండానో ఏదేదో మాట్లాడేశారు. చంద్రబాబు ఆరోపించారు కాబట్టి తమ్ముళ్ళంతా వివేకా హత్యలో జగన్, భారతిరెడ్డే కీలకమని నానా గోలచేశారు. ఎల్లోమీడియా కూడా ఇదే విధమైన ప్రచారంచేసింది. వివేకా హత్య తర్వాత సునీల్ యాదవ్, ఉదయ్ ఎంపీ అవినాష్, భాస్కర్ ఇంట్లో ఉన్నారని గతంలో చెప్పింది తప్పని ఇపుడు సీబీఐ ఒప్పుకున్నది.
తీరా చూస్తే గూగుల్ టేక్ అవుట్ విషయంలో సీబీఐ తన తప్పును ఒప్పుకుంది. గూగుల్ టేక్ అవుట్ లో టైంను లెక్కించేటపుడు 5.30 గంటలను తాము తప్పుగా లెక్కించినట్లు అంగీకరించింది. అంటే గూగుల్ టేక్ అవుట్ లో తెల్లవారిజాము 2.30 గంటలు చూపిందంటే అది గ్రీన్ విచ్ మీన్ (జీఎంటీ)గా చెప్పింది. ఆ టైంను భారత కాలమానం ప్రకారం (ఐఎంటీ) లెక్కించాలంటే దానికి 5.30 గంటలు కలపుకోవాలని చెప్పింది. అయితే గతంలో తాము అలా కలపలేదని ఒప్పుకున్నది. అందువల్లే సునీల్ యాదవ్, భాస్కర్, అవినాష్ మొబైల్ ఫోన్ లొకేషన్ను గుర్తించటంలో తప్పు జరిగిందని ఇపుడు అంగీకరించింది. సీబీఐ తన తప్పును అంగీకరించింది సరే మరి చంద్రబాబు ఏమిచేస్తారు ?