చైనాకు శ్రీలంక చెక్.. ఇండియాతోనే దోస్తీ?
తాత్కాలికంగా రాజపక్సే చేత నియమించబడినవాడు. ఇప్పుడు శ్రీలంక అధ్యక్షుడు భారతదేశానికి వచ్చాడు. ఆయన ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తో కీలకమైన చర్చలు జరిపారని సమాచారం. అది కూడా శ్రీలంకకి ల్యాండ్ రూట్ వేయాలనే ఆలోచనతో ఆయన కీలకమైన చర్చలు జరిపారని సమాచారం. ఇప్పటి వరకు శ్రీలంక వెళ్లాలంటే ఫ్లైట్ రూట్ ద్వారా గానీ, లేదా షిప్ రూట్ ద్వారా గాని వెళ్ళవలసి వచ్చేది.
శ్రీలంకకి మనకి మధ్య యాభై కిలోమీటర్ల దూరం ఉన్న ప్రాంతంలో ఈ ల్యాండ్ రూట్ ప్లాన్ చెయ్యాలని అనుకుంటున్నారు. అంతేకాకుండా నాలుగు బిలియన్ డాలర్లతో సముద్రంలో ఆయిల్ పైప్ లైన్ వేయాలని కూడా అనుకోవడం జరిగింది. ఇలా సముద్రంలో ఆయిల్ పైప్ లైన్స్ వేయడం ద్వారా, ఆయిల్ ను షిప్స్ ద్వారా సప్లై చేసే బదులు డైరెక్ట్ గా ఈ పైప్ లైన్స్ ద్వారానే సప్లై చేసే అవకాశం ఉంటుంది.
అలాగే ట్రికోలి ట్యాంక్ ఫామ్ కి భారత్ నిధులు ఇచ్చే ఏర్పాటు కూడా జరుగుతుందని తెలుస్తుంది. మన రూపాయితో ట్రాన్సాక్షన్స్ కి కూడా ఒప్పందాలు జరిగాయట. గతంలో శ్రీలంక లో కొత్తగా ఎన్నికైన అధ్యక్షునితో మన విదేశాంగ మంత్రి వెంటనే వెళ్లి కలుసుకొని వచ్చేవారు. ఆ తర్వాత శ్రీలంక అధ్యక్షుడు భారత్ వచ్చేవారు. కానీ ఇప్పుడు మనవాళ్ళు వెళ్లడానికి ఒక సంవత్సరం సమయం తీసుకున్నారు. ఎందుకంటే చైనా చేతుల్లో ఉన్న శ్రీలంకని వదులుకోలేక, నమ్మలేక భారత్ చేస్తున్న కార్యాచరణ ఇది.