అమరావతి : జగన్ పై పవన్ ద్వేషానికి ఇదే ఉదాహరణ

Vijaya


జగన్మోహన్ రెడ్డిపై పవన్ కల్యాణ్ కు నిలువెల్లా ద్వేషం తప్ప మరేమి లేదనటానికి ఇదే తాజా ఉదాహరణ. ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా చాలా ప్రాంతాలు జలమయమైపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం పేదలకు నిర్మిస్తున్న జగనన్న కాలనీల పరిస్ధితి ఏమిటో జనాలందరికీ తెలియచేయాలని పవన్ పిలుపిచ్చారు. శనివారం ఉదయం నుండి రాత్రి వరకు నేతలు, కార్యకర్తలు జగనన్న కాలనీల్లో తిరిగాలట.



తిరిగి ఏమిచేయాలంటే నీటముణిగిపోయిన వీడియోలు, ఫొటోలను పార్టీ ట్విట్టర్ ఖాతాలోను, వెట్ సైట్లోను అప్ లోడ్ చేయాలట. జగనన్న కాలనీలు నీళ్ళల్లో ముణిగిపోయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని పవన్ పెద్ద పిలుపే ఇచ్చారు. ఇక్కడే పవన్ శాడిజమంతా బయటపడుతోంది. ఎందుకంటే కుంభవృష్టి పడుతున్నపుడు జగనన్న కాలనీలే కాదు ఎంత పక్కాగా కట్టిన కాలనీలు కూడా నీళ్ళల్లోనే ముణిగిపోతాయి.  హైదరాబాద్, కాజీపేట రైల్వేస్టేషన్లే నీళ్ళల్లో ముణిగిపోయాయి. ఇక హైదరాబాద్ నగరం గురించి చెప్పాల్సిన అవసరమేలేదు. ఊర్లకు ఊర్లే ముణిగిపోతున్నపుడు జగనన్న కాలనీలు లెక్కింటి ?



అలాంటిది జగనన్న కాలనీలు నీళ్ళల్లో ముణిగిపోవటంలో ఆశ్చర్యమేముంది. ఏ ప్రభుత్వం అయినా పేదలకు ఇళ్ళపట్టాలు, కాలనీలను ఊర్లకు దూరంగానే ఇస్తాయి. పేదలకు ఇచ్చే పట్టాలు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోకాపేట సెంటర్లలో ఇస్తుందా ? బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లోని  లోలయింగ్ ఏరియాలు కూడా నీళ్ళల్లో ముణిగిపోయాయి. ఒక కాలని కట్టిన తర్వాత డ్రైనేజి వ్యవస్ధ ఏర్పడేంతవరకు కాలనీల్లో ఇలాగే నీళ్ళు నిల్వ ఉంటాయంతే. ఇందులో ఆశ్చర్యమేముంది ?



వైజాగ్, విజయవాడ, కర్నూలు, అనంతపురం, కాకినాడ, రాజమండ్రి నగరాల్లో ఇఫుడు ప్రముఖ సెంటర్లు అనుకున్నవి కూడా ఒకపుడు ఊరి శివారు ప్రాంతాలే. మెల్లిగా ఊరు పెద్దదై, నగరం, మహా నగరమైన తర్వాత అవే ప్రాంతాలు నగరంలో కాస్ట్లీ ఏరియాలైపోతాయి. కాబట్టి ఇఫుడు నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీల్లో కచ్చితంగా నీళ్ళు నిల్వ ఉంటాయనటంలో సందేహంలేదు. అంతమాత్రాన ప్రభుత్వం ఏదో తప్పుచేసేస్తోందని పవన్ అనుకోవటమే విచిత్రం. మళ్ళీ దీనికి వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయటం ఒకటి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: