కోస్తా : నెల్లూరు ఎంపీ అభ్యర్ధిని ఫైనల్ చేశారా ?

Vijaya



రాబోయే ఎన్నికల్లో పోటీచేసే ఎంపీ అభ్యర్ధిని జగన్మోహన్ రెడ్డి ఫైనల్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుత రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డే కాబోయే నెల్లూరు లోక్ సభ ఎంపీ అభ్యర్ధి. సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డిని వచ్చేఎన్నికల్లో నెల్లూరు రూరల్ ఎంఎల్ఏగా పోటీచేయించేందుకు జగన్ ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే నెల్లూరు రూరల్లో ఎంఎల్ఏగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధరరెడ్డి టీడీపీలోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే.





జగన్ కు ఎంతో సన్నిహితుడు, నమ్మకస్తుడనే పేరున్న కోటంరెడ్డి వివిధ కారణాలతో జగన్ పై తిరుగుబాటు చేశారు. దాంతో అర్జంటుగా రూరల్ నియోజకవర్గంలో ఒక గట్టి అభ్యర్ధిని చూసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇదే సమయంలో ఆదాల కూడా రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీచేయాలనే ఆలోచనలో ఉన్నారు. దాంతో అవకాశం రావటంతో జగన్ చెప్పినట్లు రూరల్ నియోజకవర్గ బాధ్యతలు తీసేసుకున్నారు. పరిస్ధితులన్నీ అనుకూలిస్తే ఆదాల ప్రభాకరరెడ్డే రూరల్ అభ్యర్ధి అవుతారనటంలో సందేహంలేదు.





సిట్టింగ్ ఎంపీ సీటును ఖాళీచేస్తే మళ్ళీ కొత్త అభ్యర్ధిని చూసుకవాల్సిందే కదా. అందుకనే ఇదే విషయాన్ని వేమిరెడ్డితో  జగన్ మాట్లాడినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అందుకు వేమిరెడ్డి కూడా ఓకే చెప్పారట. మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డితో పాటు  ఎంఎల్ఏలతో కూడా చూచాయగా జగన్ ఇదే విషయాన్ని ప్రస్తావించారట. అందుకు అందరు సానుకూలంగా స్పందించారు. కాబట్టి వేమిరెడ్డి దాదాపు నెల్లూరు ఎంపీ అభ్యర్ధి అయిపోయినట్లే అని నేతలు అంటున్నారు.




మరి ఇదే సమయంలో టీడీపీ పరిస్ధితి ఏమిటి అన్నదే ఆసక్తిగా మారింది. ఇప్పటికైతే టీడీపీకి ఎంపీగా పోటీచేసేంత గట్టి అభ్యర్ధి లేరనే చెప్పాలి. సీనియర్ నేత బీద రవిచంద్రయాదవ్ పేరును చంద్రబాబునాయుడు పరిశీలిస్తున్నారట. ఆనం రామనారాయణరెడ్డి పేరు కూడా వినబడుతున్నా ఆయన కొట్టిపారేశారు. వేమిరెడ్డిని ఎదుర్కోవటం టీడీపీకి అంత సులభంకాదు. అందుకనే పార్టీలోని నేతలతో సమీక్షల్లో చంద్రబాబు తరచూ ఇదే విషయాన్ని మాట్లాడుతున్నారు. మరి చివరకు పోటీచేయబోయే తమ్ముడెవరో ఎప్పటికి తెలుస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: